
హైదరాబాద్: 'జట్టును ఎలా నడిపించాలో అని ఆలోచించి బాధపడకు. ధోనీని కలిస్తే సెట్ అయిపోతావ్.' అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ ఆ దేశ కెప్టెన్ సర్ఫరాజ్‌కు సూచిస్తున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి నేర్చుకోవాల్సి ఉందంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ హితవు పలికాడు.
గత కొంతకాలంగా ఫామ్, ఫిటెనెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సర్ఫరాజ్ జట్టుకి వికెట్ కీపర్/ కెప్టెన్‌గా తగిన న్యాయం చేయలేకపోతున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమస్యల్ని గతంలో సమర్థంగా ఎదుర్కొన్న మహేంద్రసింగ్ ధోనీతో సర్ఫరాజ్ చర్చిస్తే మంచిదని మొహమ్మద్ యూసఫ్ పేర్కొన్నాడు.
'ఫిటెనెస్ మెరుగుపర్చుకునేందుకు సర్ఫరాజ్ అహ్మద్ చాలా శ్రమించాల్సి ఉంది. తన ప్రదర్శన బాగా లేకపోయినా జట్టు నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించడం మంచి పద్ధతి కాదు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా సుదీర్ఘకాలం భారత్ జట్టుని మూడు ఫార్మాట్లలో విజయవంతంగా నడిపించాడు.' అని పేర్కొన్నాడు.
ఒక బ్యాట్స్‌మెన్/వికెట్ కీపర్‌గానూ అతను మెరుగ్గా రాణించాడు. ధోనీ నుంచి సర్ఫరాజ్ చాలా నేర్చుకోవాలి. అతనితో మాట్లాడి సమస్యలు చర్చించి సలహాలు తీసుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే ఓ వికెట్ కీపర్ కెప్టెన్‌గా జట్టుని నడిపించడం అంత సులువు కాదు' అని మొహమ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.