టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగేది అతనే..! మూడు రోజుల్లో ఆస్ట్రేలియాకు

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత T20 ప్రపంచకప్‌కు ముందస్తుగా సన్నద్ధమయ్యేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని మొత్తం 14మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సభ్యులు రెండ్రోజుల క్రితమే విమానంలో ఆసీస్ చేరుకున్నారు. ఇకపోతే గాయం కారణంగా దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరూ ఆస్ట్రేలియాకు వెళ్తారో అనేది డైలామా ఉంది. పీటీఐ ప్రకారం..బుమ్రా స్థానంలో జట్టులో చేరే ప్లేయర్ ఎవరనేదానిపై సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది.
బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ టీ20 ప్రపంచకప్ జట్టులోకి రాబోతున్నాడని, అతను 3 రోజుల్లో ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు అతను కరోనా బారిన పడడంతో ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్లకు షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక రిజర్వ్ ప్లేయర్ అయిన షమీ పట్ల విశ్వాసముంచుతూ సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనుభవం ఉండడమే ప్లస్ పాయింట్
నిలకడగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా టీ20 సెటప్‌లో గత కొన్ని నెలలుగా షమీకి ఛాన్స్‌లు ఇవ్వట్లేదు. 2021 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా షమీ ఆడలేదు. ఈ దశలో టీమిండియా చాలా మంది యువ పేసర్లతో ప్రయోగాలు చేసింది. ఇకపోతే గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమైనప్పటికీ.. సిరాజ్‌ను తీసుకున్న టీమిండియా మేనేజ్ మెంట్ షమీని మాత్రం తీసుకోలేదు.
టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేల్లో షమీ ఆడతాడనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో అతను టీ20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవ్వడం దాదాపు కష్టమేనంటూ ఊహాగానాలు అందుకున్నాయి. అయితే అనుభవమున్న ప్లేయర్ కాబట్టి అతన్ని జట్టులోకి తీసుకోవడమే ఉత్తమం అని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్లలో షమీ, దీపక్ చాహర్ ఉన్నారు.

అక్టోబర్ 23న పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు గురువారం తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయలుదేరింది. 2007లో తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించగా.. అప్పుడు భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 15ఏళ్ల నిరీక్షణకు తెరదించే వేళయింది. మరోసారి ట్రోఫీ ముద్దాడాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది.
ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ టోర్నీని భారత్ ప్రారంభించనుంది. సూపర్ 12దశకు ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడి వరల్డ్ కప్ బరిలోకి జట్టు దిగనుంది.

రోహిత్ ఒపినియన్ ఏంటంటే?
ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ముందు మనకు ఎలాంటి కాంబినేషన్ కావాలో చూసుకోవాలి. బుమ్రాను మేం ఎలా ప్రయోగించాలనుకున్నామో దాని మీద మాకో స్పష్టత ఉంది.
అలా మా ప్లాన్స్ అమలు చేసేందుకు సరిపడా బౌలర్‌ను కనుగొనాలి. ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేసిన అనుభవం కాస్త ఉండాలి. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లాక ఒకసారి అక్కడ బౌలింగ్, పిచ్‌లు ఎలా ఉన్నాయి.. ఎవరైతే సెట్ అవుతారు అదంతా చూశాక ఓ నిర్ణయానికొస్తాం.' అని రోహిత్ శర్మ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications