తప్పు చేశావ్ షమీ..! మత ఛాందసవాదుల ఆగ్రహం..! షమీ చేసింది ముమ్మాటికీ రైట్.. మరో వర్గం మద్దతు

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మీద కొందరు మత ఛాందసవాదులు విరుచుకుపడ్డారు. నువ్వింతకు ముస్లిమ్‌వేనా అతనిపై ఆగ్రహోద్రిక్తులయ్యారు. షమీ చేసిన పనికి సిరీయస్ అవుతూ పోస్టులు, కామెంట్లు చేశారు. షేమ్ షమీ.. నీ నుంచి ఇలాంటి పని ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ మత మౌఢ్యులు విరుచుకుపడ్డారు. షమీ ఇలాంటోడా అంటూ కించపరిచే వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు.
ఇంతకీ కొందరు మతవాదుల కోపానికి ఎందుకు షమీ కారణమయ్యాడో తెలిస్తే మీరు షాక్ అవడం ఖాయం. షమీ తన మతాన్ని కించపరిచే విషయమేమీ చేయలేదు. షమీ చేసింది సోదర భావానికి ప్రతీకగా నిలిచే పని. పైగా మత సామరస్యాన్ని ఇనుమడించే పని. కానీ కొందరు మత మందబుద్ధులకు మాత్రం షమీ చేసింది ముమ్మాటికీ తప్పే అనిపించింది.
అసలింతకు షమీ చేసిన పనేంటంటే..
మహమ్మద్ షమీ దసరా సందర్భంగా "హ్యాపీ దసరా" అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ట్వీట్లో రాముడు.. రావణున్ని చంపుతున్న ఫోటో ఒకటి ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే ఈ దసరా సందర్భంగా.. ఆ రాముని దీవెనలతో మీ అందరి ఇంట సుఖశాంతులు సౌభాగ్యాలు విరాజిల్లాలని కోరుకుంటున్నాను. హ్యపీ దసరా టు మీకు మీ ఫ్యామిలీకి అంటూ షమీ తన సహచరులు, అభిమానులనుద్దేశించి పోస్ట్ చేశాడు. ఇందులో ఏమాత్రం తప్పు కనబడలేదు. అయితే షమీ మతం ముస్లిం. ఒక ముస్లిం అయి ఉండి హిందూ పండగకు విష్ చేయడం ఏంటనేది కొందరి మత ఛాందసుల వాదన. వాళ్లే షమీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.
షమీ పాపానికి ఒడిగట్టాడంటూ..
ఓ నెటిజన్.. అతనిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ముస్లింలు దసరా శుభాకాంక్షలు పంచుకోవడం పాపమంటూ షమీ పాపానికి ఒడిగట్టాడంటూ మండిపడ్డాడు. మరో నెటిజన్.. భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించడానికి ఈ సందర్భాన్ని షమీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. షమీ మతానికి విరుద్ధమైన ప్రకటనతో ఆశ్చర్యపరిచాడని ఇంకొంతమంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. కొందరు అతనిపై ఫత్వా విధించాలంటూ ఖండించారు. మరొకరు ‘షమీ నీ గురించి తలుచుకుంటే షేమ్ అనిపిస్తుంది. నువ్వు రాముడికి విశ్వాసివా' అంటూ మండిపడ్డాడు.
షమీ అసలైన భారతీయుడు
ఇక మరికొందరు మాత్రం షమీ చేసింది ముమ్మాటికీ సరైన పనే.. ముందు మనందరం భారతీయులం ఆ తర్వాతే మతం అనే విషయాన్ని గుర్తుంచుకుని సోదరభావంతో ఇరు మతాల సంప్రదాయాలు గౌరవించడమే అసలైన భారతీయుడి లక్షణం అంటూ షమీకి మద్దతు పలికారు. షమీ ఏ మతానికి చెందినవాడు కాదు.. ప్రతి భారతీయుడు ఆరాధించే క్రికెట్ అనే మతానికి చెందినవాడు.. అంటూ షమీ ప్రొఫెషన్‌ను కొందరు హైలెట్ చేశారు. ఇంకొందరు విడదీసే పలుకులతో మీరు షమీ మనస్సును ఏమార్చలేరు.. పండుగకు శుభాకాంక్షలు చెప్పేది సర్వసాధారణమైన లక్షణం.. అది షమీ కాదు ప్రపంచంలోని ఏ ముస్లిం నేత చేసిన తప్పే కాదు అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు. రంజాన్, దసరా, క్రిస్ మస్ ఇలాంటి గొప్ప పండుగలన్నీ పరస్పర భావంతో అందరూ జరుపుకోవాల్సినవే కానీ విడదీసేందుకు కాదని గుర్తుంచుకోండంటూ పలువురు ట్వీట్లు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications