
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ 2022 పోరుకు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా మొత్తం 16 జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తలపడనున్నాయి. ఇందులో నాలుగు జట్లు గ్రూప్ దశలోనే తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. మిగిలిన టీమ్స్ సూపర్ 12లో ఆడతాయి. ఈ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఈ నెల 23వ తేదీన ఆరంభించనుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది.
ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన ఆదివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్‌లో బ్లాక్ క్యాప్స్‌ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.
దీనికి సన్నాహకంగా.. రెండు వామప్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది రోహిత్ సేనకు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై వామప్ మ్యాచ్‌లను ఆడబోతోంది. ఈ నెల 17, 19 తేదీల్లో ఉదయం 8:30 గంటలకు వామప్ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో, మలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ రెండూ బ్రిస్బేన్ స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి.
అనంతరం సూపర్ 12లో భాగంగా 23వ తేదీన పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ రెండు వామప్‌లకు మహ్మద్ షమీ అందుబాటులోకి రానున్నాడు. తుదిజట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గాయం వల్ల జస్‌ప్రీత్ బుమ్రా వైదొలగడంతో అతని స్థానంలో షమీని 15 మందిలో చోటు కల్పించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమిటీ. కోవిడ్ బారిన పడిన షమీ మూడు వారాల పాటు క్వారంటైన్‌లో గడిపాడు.
ఫలితంగా- అతను జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు ట్రావెల్ చేయలేకపోయాడు. కోవిడ్ నుంచి కోలుకున్న నేపథ్యంలో అతన్ని ఆస్ట్రేలియాకు పంపించింది బీసీసీఐ. అటాకింగ్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.. ఆలస్యంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు. దీపక్ చాహర్ గాయపడటం వల్ల అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ రీప్లేస్ అయ్యాడు. రిజర్వ్ ప్లేయర్‌గా