
ఆరు పరుగుల తేడాతో..
టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా తడబడింది. చేతులెత్తేసింది. 180 పరుగుల వద్దే ఆగిపోయిందా జట్టు జర్నీ. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఒత్తిడికి గురైంది. ఆ ఓవర్‌లో నాలుగు వికెట్లను కోల్పోయింది. చివరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు పడ్డాయి.

మెరిసిన కేఎల్..
టీమిండియా ఇన్నింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్, టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లపై అటాక్‌కు దిగారు. కేఎల్ రాహుల్ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు, ఆరు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుని పడ్డాడు. 4,0,6,4,2,4తో 20 పరుగులు పిండుకున్నాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు.

తక్కువ పరుగులకే..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ పెద్దగా రాణించలేదు. రోహిత్-15, కోహ్లీ-19, హార్దిక్ పాండ్యా-2, దినేష్ కార్తీక్-20, అక్షర్ పటేల్-6 పరుగులు చేయగలిగారంతే. ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో పాతుకు పోయాడు. తనదైన శైలిలో విజృంభించాడు. 33 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేసిన సూర్యకుమార్.. చివరి ఓవర్ నాలుగో బంతికి అవుట్ అయ్యాడు.

ప్రారంభంలో పీక్స్‌కు..
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో అదరగొట్టింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్, ఆరోన్ ఫించ్ తొలి వికెట్ నష్టానికి 64 పరుగులు జోడించారు. మార్ష్ 35 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ- ఫించ్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. హాఫ్ సెంచరీ చేశాడు. స్టీవెన్ స్మిత్-11, గ్లెన్ మ్యాక్స్‌వెల్-23, టిమ్ డేవిడ్-7, జోష్ ఇంగ్లిస్-1, మార్కస్ స్టొయినిస్-7, అగర్-0, మిఛెల్ స్టార్క్-0, కేన్ రిచర్డ్‌సన్-0 పరుగులు చేశారు.

చివరి ఓవర్‌లో ట్విస్టులు..
చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా పరాజయాన్ని చవి చూడటం ఒక ఎత్తయితే.. నాలుగు వికెట్లను కోల్పోవడం మరో ఎత్తు. మహ్మద్ షమీ విసిరిన తొలి రెండు బంతులకు నాలుగు పరుగులొచ్చాయి. నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో వరుసగా వికెట్లు పడ్డాయి. నాలుగు బంతులకు నలుగురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ఇదో అద్భుతమే.

తొమ్మిది పరుగుల తేడాతో ఆరు వికెట్లు..
మూడో బంతికి పాట్ కమ్మిన్స్ అవుట్ అయ్యాడు. ఒంటి చేత్తో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నాలుగో బంతికి అష్టన్ అగర్ రనౌట్ అయ్యాడు. అయిదు, ఆరు బంతులకు వరుసగా ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను బలితీసుకున్నాడు షమీ. చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది ఆసీస్. ఆస్ట్రేలియా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏ స్థాయిలో ఒత్తిడికి గురయ్యారనేది ఈ ఓవర్‌తో తేలిపోయింది.


Click it and Unblock the Notifications
