వరల్డ్‌కప్ 2019: భారత జట్టు విజయాల్లో కీలకం కానున్న షమీ!


హైదరాబాద్: మహమ్మద్ షమీ... మూడు నెలల క్రితం కుటుంబ సమస్యలతో సతమతమయ్యాడు. దీంతో షమీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కడమే గగనంగా మారింది. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మూడో పేసర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

షమీపై సెలక్టర్ల నమ్మకం
దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ జట్టులో సెలక్టర్లు షమీపై కూడా నమ్మకం ఉంచారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేస్ బౌలింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. కివీస్, న్యూజిలాండ్ పర్యటనతో ఈ జాబితాలోకి తాజాగా షమీ కూడా చేరిపోయాడు.

విండిస్‌తో జరిగిన సిరిస్‌లో
సెప్టెంబర్ 2017 నుంచి అక్టోబర్ 2018 వరకు మహమ్మద్ షమీకి ఎక్కువగా టెస్ట్‌ల్లోనే ఎక్కువగా అవకాశమిచ్చేవారు. దీంతో ఏడాది పాటు వన్డేల్లో అడే అవకాశమే రాలేదు. అయితే, గతేడాది విండీస్‌తో జరిగిన సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని షమీ చక్కగా వినియోగించుకున్నాడు..

న్యూజిలాండ్‌లో సత్తా చాటిన షమీ
ముఖ్యంగా న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌లో సత్తా చాటాడు. కివీస్ గడ్డపై పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పేస్ బౌలింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌లపై వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి కివీస్‌ను దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

గత 10 వన్డేల్లో 19 వికెట్లు తీసిన షమీ
మొత్తంగా 5 వన్డేల్లో 12 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. గత 10 వన్డేల్లో షమీ 19 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో భారత జట్టు వన్డే సిరిస్‌ను గెలుచుకోవడంపై కీలకపాత్ర పోషించాడు. దీంతో వరల్డ్ కప్ జట్టులో మహమ్మద్ షమీ ఎంపిక ఖావడం ఖాయంగా వినిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications