Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammad Shami : నా కాళ్లు అలసిపోలేదు.. నేను వెనకడుగు వేయలేదు.. నా ప్రయాణం ఇంకా మిగిలే ఉంది

Mohammad Shami Posted A reel Which Shows His Temperament Towards His comeback

కోవిడ్ వల్ల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లకు మహమ్మద్ షమీ మిస్సయిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న మహ్మద్ షమీ ఓపెన్ ఫీల్డ్‌లో నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. సదరు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. షమీ చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ల కోసం ఎంపికయిన సంగతి తెలిసిందే. అయితే అతను ఆసీస్ సిరీస్‌కు ముందు కరోనా బారిన పడడంతో అతను ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు మిస్సవ్వాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20రోజున కోవిడ్ 19 నుంచి కోలుకున్నప్పటికీ.. అతను పూర్తి ఫిట్ నెస్ సాధించాడో లేదో అనే డౌట్‌తో ఈ సిరీస్ నుంచి టీం మేనేజ్‌మెంట్ తప్పించింది.
అయినప్పటికీ.. షమీ చాలా ఫిట్‌గా ఉన్నట్లు తాజాగా అతను పోస్ట్ చేసిన ఇన్‌స్టా వీడియోలో అర్థమవుతుంది. అతను ఫుల్ టచ్‌లో బౌలింగ్ చేస్తూ.. స్టంప్‌లను యార్కర్లతో పడగొట్టడం కన్పించింది.

అతను ఈ ఇన్ స్టా రీల్‌కు 'సఫర్ జరీ హై' అని క్యాప్షన్ పెట్టాడు. అంటే జర్నీ ఇంకా కొనసాగుతోంది అని అర్థం. ఇక రీల్‌లో షమీ వాడిన బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా కాస్త పరోక్షంగా టీం మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి పెట్టినట్లు కన్పిస్తుంది. 'నా థాకే హై పావ్ కభీ (నా కాళ్లు ఎప్పుడూ అలసిపోలేదు), నా హీ హిమ్మత్ హరి హై (నేను ఎప్పుడూ వెనకడుగు వేయాలని భావించలేదు). మైనే దేఖే హై కై దౌర్ (నేను అన్ని రకాల దశలను చూశాను), ఔర్ ఆజ్ భీ సఫర్ జారీ హై (నా ప్రయాణం ఇంకా కొనసాగుతోంది).' అని షమీ పోస్టు చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ అర్థం.

నిలకడగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా టీ20 సెటప్‌లో గత కొన్ని రోజులుగా షమీకి ఛాన్స్‌లు ఇవ్వట్లేదు. 2021 నవంబర్ నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా షమీ ఆడలేదు. ఈ దశలో టీమిండియా చాలా మంది యువ పేసర్లతో ప్రయోగాలు చేసింది. ఇకపోతే గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమైనప్పటికీ.. సిరాజ్‌ను తీసుకున్న టీమిండియా మేనేజ్ మెంట్ షమీని మాత్రం తీసుకోలేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డేల్లో షమీ ఆడతాడని, కొంత రిథమ్ పొందే అవకాశం ఉందని పలు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ రిజర్వ్‌ ఆటగాళ్లలో షమీ ఉన్నాడు. అతను టీ20ప్రపంచకప్‌కి వెళ్లే ప్రధాన జట్టులో భాగమవుతాడో లేదో వేచి చూడాల్సిందే.

Story first published: Sunday, October 2, 2022, 11:45 [IST]
Other articles published on Oct 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+