For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకి షమీ: మూడో బౌలర్‌గా అరుదైన ఘనత

#ICCTestRankings : Mohammad Shami Enters Into No 7 Of ICC Test Rankings For Bowlers || Oneindia
Mohammad Shami Enters into Top 10 of ICC Test Rankings For Bowlers

హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారంతో ముగిసిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో షమీ ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. షమీ సాధించిన 790 రేటింగ్ పాయింట్లు ఓ భారత పేసర్‌కు మూడో అత్యుత్తమం కావడం విశేషం.

అంతకముందు కపిల్ దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832) రేటింగ్ పాయింట్లతో షమీ కంటే ముందున్నారు. ఇక, ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో అశ్విన్‌కు కూడా చోటు దక్కింది. మరోవైపు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు చెర్ స్థానం ఎగబాకి వరుసగా 20, 22వ స్థానాల్లో నిలిచారు.

ఇక, బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌ల విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. 28 ఏళ్ల మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో మయాంక్ అగర్వాల్ ఖాతాలో 691 రేటింగ్ పాయింట్లు వచ్చి చేరాయి. తన తొలి ఎనిమిది టెస్టుల్లో మయాంక్ 858 పరుగులు చేశాడు.

ఆల్ రౌండర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. ఇక, తొలి టెస్టులో 43, 64 పరుగులతో రాణించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ ముష్పికర్ రహీమ్ నాలుగు స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు. లిట్టన్ దాస్ 92వ స్థానం నుంచి 86వ స్థానానికి ఎగబాకాడు.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని మరింతగా పదిలం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే, వెస్టిండిస్‌పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన... స్వదేశంలో సఫారీలతో జరిగిన మూడు టెస్టుల సిరిస్‌ను సైతం 3-0తో నెగ్గింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన... నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా చారిత్రాత్మక డే/నైట్ టెస్టులో తలపడనుంది.

Story first published: Tuesday, November 19, 2019, 12:32 [IST]
Other articles published on Nov 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+