న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Watch video: అచ్చం ధోనిలాగే! వికెట్లను చూడకుండా స్టంపౌట్ (వీడియో)

MS Dhoni Styled Run Out In Bangladesh Premier League | Oneindia Telugu
Mohammad Shahzad emulates MS Dhoni with a no-look run-out in Bangladesh Premier League - Watch video

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ షెహజాద్ బహిరంగంగా గతంలో ఎన్నోసార్లు తాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని అని చెప్పాడు. తాజాగా అచ్చం ధోనిలాగే వికెట్ కీపింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు.

200 ODIs: భారత్ తరుపున తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు200 ODIs: భారత్ తరుపున తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు

బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్)‌లో చిట్టగాంగ్ వికింగ్స్‌తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్‌ని రనౌట్ చేసి తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్పిన్నర్ హసన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని హిట్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలిచిన క్రమంలో రెహ్మన్ పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ వారించడంతో మళ్లీ వెనక్కివెళ్లాడు.

అప్పటికే బంతిని అందుకున్న షెహజాద్ కనీసం వికెట్ల వైపు చూడకుండా బంతిని వెనక్కి విసిరి వికెట్లను గిరాటేశాడు. గతంలో ఓ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని సైతం ఇదే తరహా రనౌట్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, February 1, 2019, 17:19 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X