Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T2OI Batting Rankings: బాబర్ ఆజామ్‌కు ఎసరు పెట్టిన రిజ్వాన్.. పడిపోయిన సూర్యకుమార్

Mohammad Rizwan Reached Number 1 Rank in T20I Mens Batting Ranks

పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు ఎసరు పెట్టాడు. నంబర్ 1 T20 బ్యాటర్‌గా నిలిచాడు. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి బాబర్ ఆజామ్ పడిపోయాడు. వీరిద్దరు పాక్ తరఫున కీలక ప్లేయర్లుగా, ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో జరుగుతున్న ఆసియా కప్ ఎడిషన్‌లో రిజ్వాన్ అద్భుతమైన ఫామ్‌ కనబర్చుతున్నాడు. 29ఏళ్ల అతను ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో.. రిజ్వాన్ 96సగటుతో 192పరుగులు చేశాడు.

అందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. అతను 128స్ట్రైక్ రేట్‌తో తన బ్యాటింగ్ పదును చూపించాడు.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్థాన్ 155పరుగుల తేడాతో హాంకాంగ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. రిజ్వాన్ ఆ మ్యాచ్‌లో 57బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 78పరుగులు చేశాడు. ఫాఖర్ జమాన్‌తో కలిసి 93పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

దుబాయ్‌లో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో రిజ్వాన్ భారత్‌పై 71పరుగులు చేశాడు. అయితే ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా మహ్మద్ నవాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఈ మ్యాచులో గెలుచుకున్నాడు. ఇకపోతే శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండిస్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు. ఇక భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇక దసున్ షనక కూడా ఏడు స్థానాలు ఎగబాకాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ చేయడంతో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు పడిపోయి 29వ స్థానానికి పడిపోయాడు.

Story first published: Wednesday, September 7, 2022, 15:20 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+