Mohammad Rizwan Trolls: వీడేవండి బాబు.. ప్రతీసారి అప్పీల్ చేస్తూ ఒకటే నస! పాక్ కీపర్‌కు హార్దిక్ వార్నింగ్!

ఆసియాకప్ మెగా టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అనే రేంజులో సాగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందించింది. తొలుత పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు భువీ 4, అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 3, అవేశ్ ఖాన్ 1 వికెట్ తీసి పాక్ పతనాన్ని శాసించారు. ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43పరుగులు) ఒక్కడే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ హార్దిక్ పాండ్యా (33) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్రా జడేజా (35), కోహ్లీ (35) సమయోచిత ఇన్నింగ్స్‌ల వల్ల 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇకపోతే భారత్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో పాకిస్థాన్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ నానా హంగామా చేశాడు.
బంతి మిస్సయితే చాలు
భారత బ్యాటర్లకు బంతి మిస్సయితే చాలు ఔట్ అంటూ తెగ అప్పీలు చేశాడు. మిస్సయిన ప్రతీ బంతికి రిజ్వాన్ అప్పీలు చేస్తుంటే భారత అభిమానులు తెగ కంగారు పడ్డారు. అనవసర అప్పీళ్లతో పైశాచిక ఆనందం పొందిన రిజ్వాన్‌కు హార్దిక్ పాండ్యా గట్టి బుద్ధి చెప్పాడు. తన మార్క్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పేశాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ చేసిన మరో పని కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓవర్ తర్వాత ఎండ్ ఛేంజ్ అయ్యే టైంలో రిజ్వాన్‌ను మోచేతితో పట్టేసుకుని ఇంకోసారి అనవసరంగా అప్పీలు చేస్తావా అన్నట్లు సరదాగా ఆటపట్టించాడు. ఇక ఈ ఫోటో నెట్టింట్లో విశేషంగా ట్రెండ్ అవుతుంది.
అలా వదిలేయకండ్రా ఎవరికన్నా చూపించండ్రా
ఇకపోతే రోహిత్ శర్మ స్టంపౌట్ విషయంలో కూడా రిజ్వాన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. అంపైర్ నాటౌట్ అని పేర్కొన్నా.. అరే థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయ్ అంటూ పేర్కొన్నాడు. ఇక థర్డ్ అంపైర్ చూసి అది క్లీన్ నాటౌట్ అని ప్రకటించడంతో రిజ్వాన్ సల్లబడ్డాడు. ఇక రిజ్వాన్ గావు కేకలకు తొలుత ఇండియా అభిమానులు కంగారూ పడ్డా.. తర్వాత వీడేవడండి బాబు ప్రతిసారీ అప్పీలుతో నస అంటూ లైట్‌గా తీసుకున్నారు. రిజ్వాన్ తర్వాత ఎన్నిసార్లు అప్పీలు చేసినా వాడంతే అదో టైపు అంటూ పట్టించుకోకుండా వదిలేశారు. రిజ్వాన్ బ్యాటింగ్ పరంగా మెచ్యుర్ అయ్యాడు గానీ.. ఇంకా కీపింగ్ విషయంలో గల్లీ పోరడే అంటూ కొందరు నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఇక రిజ్వాన్ అత్యుత్సాహంపై మీమ్స్ అయితే పేట్రేగుతున్నాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్
పాకిస్తాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఇఫ్తికర్, కుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షానవాజ్ దహాని
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications