For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ రిజ్వాన్ సంచలన ఇన్నింగ్స్.. తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత! ఐదు రికార్డులు ఇవే!

Mohammad Rizwan became the first wicket keeper from Pakistan to score a century in T20s

లాహోర్: పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ మహ్మద్ రిజ్వాన్ సొంత గడ్డపై సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం సాయంత్రం లాహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన రిజ్వాన్ (104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6) అజేయ సెంచరీ బాదాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. బౌండరీలు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ టీ20ల్లో తొలి సెంచరీ అందుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు.

మెక్‌కలమ్ తర్వాత:

మెక్‌కలమ్ తర్వాత:

లాహోర్‌లో టీ20 సెంచరీ చేయడం ద్వారా.. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే, టెస్టు, టీ20ల్లో శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్రెండన్ మెక్‌కలమ్ గతంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేశాడు. స్పెషలిస్ట్ కీపర్‌గా మెక్‌కలమ్ 5 టెస్ట్, 3 వన్డే, 1 టీ20 సెంచరీ చేయగా.. రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ టీ20ల్లో సెంచరీ బాదిన ఐదో వికెట్ కీపర్‌గా కూడా రిజ్వాన్ నిలిచాడు. బ్రెండన్ మెక్‌కలమ్, మొహమ్మద్ షాజాద్, మోర్న్ వాన్ వైక్ మరియు లెస్లీ డన్బార్ టీ20ల్లో సెంచరీ చేశారు.

 పాకిస్థాన్ తరఫున తొలి వికెట్ కీపర్‌గా:

పాకిస్థాన్ తరఫున తొలి వికెట్ కీపర్‌గా:

పాకిస్థాన్ తరఫున టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన తొలి వికెట్ కీపర్‌గా మహ్మద్ రిజ్వాన్ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ పాక్ సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ 2018లో స్కాట్లాండ్‌పై చేసిన 89 పరుగులే అత్యధిక స్కోరు. అంతేకాదు టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాకిస్తాన్ ఆటగాడిగా కూడా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు అహ్మద్ షాజాద్. మొత్తానికి రిజ్వాన్ ఒక సెంచరీతో ఐదు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.

 సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడడంతో:

సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడడంతో:

2019 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ కూడా చేరకపోవడంతో ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌పై మూడు ఫార్మాట్లలోనూ వేటు పడింది. కెప్టెన్, ఆటగాడిగా జట్టులో చోటు కోల్పోయాడు. దాంతో అతని స్థానంలో వికెట్ కీపర్‌గా వచ్చిన మహ్మద్ రిజ్వాన్.. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 13 టెస్టులు, 35 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లాడిన రిజ్వాన్.. టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు.

 పాక్ విజయం:

పాక్ విజయం:

లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6) అజేయ సెంచరీ బాదాడు. రిజ్వాన్ తర్వాత హైదర్ అలీ (21) టాప్ స్కోరర్. ప్రొటీస్ బౌలర్ ఫెహ్లుక్వాయో రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులకే చేసింది. ఓపెనర్లు మలన్ (44), హేండ్రిక్స్ (54) మంచి ఆరంభం ఇచ్చినా.. ఫలితం లేకుండా పోయింది.

బెయిర్‌స్టో ఆడడం అతడికి ఇష్టం లేదు.. అందుకే ఫోక్స్‌కు అవకాశం ఇచ్చాడు! ఇంగ్లండ్ సిగ్గుపడాలి!

Story first published: Friday, February 12, 2021, 17:40 [IST]
Other articles published on Feb 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+