రామమందిర భూమి పూజపై మహ్మద్ కైఫ్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

లక్నో: దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అపూరూప ఘట్టానికి నేడు(బుధవారం) అంకురార్పణ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 40 కేజీల వెండి ఇటుకతో ఆలయనిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించి యావత్ భారతం పులకించిపోయింది. రామ నామస్మరణలతో సోషల్ మీడియా దద్దరిల్లింది.

రామ్‌లీలాను ఇష్టంగా..

ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ అపురూప కార్యక్రమంపై స్పందించాడు. గంగా-జమునా కల్చర్ మధ్య పెరిగిన తాను రామ్‌లీలాను ఇష్టంగా చూసేవాడినని ట్వీటర్ వేదికగా తెలియజేసి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.

‘అలహాబాద్‌లో గంగా-జమునా కల్చర్ మధ్య పెరిగిన నేను ప్రేమ, కరుణ, గౌరవానికి ప్రతీక అయిన రామ్‌లీలాను ఇష్టంగా చూసేవాడిని. భగవంతుడైన రాముడు ప్రతి ఒక్కరిలో మంచితనన్నే చూసాడు. మన జీవన విధానం ఆ భగవాన్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రేమతో ఐక్యంగా ఉన్న మన మధ్యలో ద్వేషానికి చోటు లేదు'అని కైఫ్ ట్వీట్ చేశాడు.

కైఫ్‌పై ట్రోలింగ్..

ఇక రామమందిర నిర్మాణానికి సానుకూలంగా ట్వీట్ చేసిన కైఫ్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతని నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరూ తప్పుబడుతున్నారు. ‘నీ ఇళ్లు కూల్చి.. అక్కడ గుడి కడితే ఆ బాధ ఏంటో నీకు తెలిసేది'అని ఒకరు కామెంట్ చేస్తే.. త్వరలోనే నిజం తెలుసుకొని బాధపడ్తావని మరొకరు కామెంట్ చేశారు. రామభక్తుల్లోనే విద్వేషం ఉందని, అందుకే మసీద్‌ను కూల్చి రామమందిరం నిర్మిస్తున్నారని ఇంకొకరు ట్వీట్ చేశారు.

‘ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం వివాదాస్పద మసీదులో లేక బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూమిలో చేసే నమాజ్ ఆ అల్లా అంగీకరించడు. ముస్లిం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహద్ బాబ్రీ మసీదులోని హిందూ దేవాలయాల అన్ని చిహ్నాలను గుర్తించారు.వాటినే సుప్రీంకు అందేజేశారు. మహ్మద్ కైఫ్ భారత్ మాతా పుత్రుడు'అని మరో అభిమాని కైఫ్‌ను కొనియాడాడు.

మోదీ శుభాకాంక్షలు..

మోదీ శుభాకాంక్షలు..

ఇక రామ మందిర భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం నినాదాలు చేశారు. ‘ఈ నినాదం కేవలం భారత్‌లోనే కాక ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు రామ్‌ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'అని అన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 5, 2020, 19:27 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X