Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోనీ బటర్ చికెన్, బిర్యానీ బాగా తింటాడు.. జిమ్‌లో శ్రమించడు.. అయినా అలా ఎలా'

Mohammad Kaif Stumped By MS Dhonis Fitness and Ability To Run Between Wickets

ఢిల్లీ: వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే అత్యుత్తమం అని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ధోనీకి ఫిట్‌నెస్ సహజసిద్ధంగా వచ్చిందన్నాడు. మహీ బటర్ చికెన్, బిర్యానీలను బాగా తింటాడు, ఇక జిమ్‌లో కూడా పెద్దగా శ్రమించడు.. అయినా అతడు ఫిట్‌గా ఉండడం చాలా ఆశ్చర్యకరం అని కైఫ్ అన్నాడు. కైఫ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సమయంలో ధోనీ ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్:

ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్:

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ సందర్భంగా మాజీలు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హలో లైవ్ సెషన్‌లో పాల్గొన్న మహ్మద్ కైఫ్ పలు విషయాలపై చర్చించాడు. 'వికెట్ల మధ్య ధోనీ చాలా వేగంగా పరుగెత్తుతాడు. నేను కూడా అతనితో కలిసి సింగిల్స్, డబుల్స్ తీశా. ఆ అనుభవంతో చెప్తున్నా.. అతని వేగం అమోఘం. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే ఫాస్టెస్ట్ రన్నర్' అని కైఫ్ఆ అన్నాడు. మహ్మద్‌ కైఫ్‌ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు.

బిర్యానీ తింటాడు.. కానీ అలా ఎలా:

బిర్యానీ తింటాడు.. కానీ అలా ఎలా:

'ఎంఎస్ ధోనీ పెద్దగా జిమ్‌‌కి వెళ్లడు. ఇతర ఆటగాళ్లలా అస్సలు కష్టపడడు. ఇక బటర్ చికెన్, బిర్యానీలను బాగానే లాగించేస్తాడు. అయినప్పటికీ వేగంగా ఎలా వికెట్ల మధ్య పరుగు తీయగలుగుతున్నాడో ఇప్పటికీ నాకు అర్ధం కావడం లేదు. ఆ రోజుల్లో నేను మంచి ఫిట్‌నెస్ కలిగి ఉన్నానని అనుకునేవాడ్ని. కానీ ధోనీ వచ్చాక నా అభిప్రాయం మారింది. మహీది న్యాచురల్ ఫిట్‌నెస్' అని మహ్మద్ పేర్కొన్నాడు.

ఆ రోజుల్లో యో-యో ఫిట్‌నెస్ ఉంటే:

ఆ రోజుల్లో యో-యో ఫిట్‌నెస్ ఉంటే:

'క్రికెటర్‌కి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను క్రికెట్ ఆడే రోజుల్లో యో-యో ఫిట్‌నెస్ టెస్టు లేదు. ఒకవేళ ఉండింటే.. నేను, లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ మాత్రమే పాసయ్యేవాళ్లం. నా అంచనా ప్రకారం జట్టులోని మిగిలిన వాళ్లెవరికీ ఆ ఫిట్‌నెస్ ప్రమాణాలని అందుకునే సామర్థ్యం అప్పట్లో లేదు' మహ్మద్ కైఫ్ అని చెప్పుకొచ్చాడు.

కైఫ్ కారణంగానే రనౌట్:

కైఫ్ కారణంగానే రనౌట్:

బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఎంఎస్ ధోనీ.. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్‌లో రనౌట్‌గా.. అదీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ధోనీ సింగిల్ కోసం కైఫ్‌ని పిలవగా.. కాస్త ముందుకు వచ్చి అనూహ్యంగా పరుగుకి నో చెప్పాడు. దాంతో అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన ధోనీ‌కి మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో (123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 రన్స్) ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు.

Story first published: Friday, May 22, 2020, 21:53 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+