Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేర్వేరు జట్లకు ఒకేసారి కోహ్లీ, రోహిత్ ఆడితే.. హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌నే చూస్తా: భారత మాజీ క్రికెటర్

Mohammad Kaif says Will head to watch Rohit before Kohli if 2 matches are going on simultaneously

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాట్స్‌మన్‌ అని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌నే తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని కైఫ్ తెలిపాడు. ఒకే నగరంలో ఒకేసారి వేర్వేరు జట్లకు కోహ్లీ, రోహిత్ ఆడుతుంటే.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌నే చూడడానికి ఇష్టపడుతా అని 39 ఏళ్ల మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

 కోహ్లీ బ్యాటింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు:

కోహ్లీ బ్యాటింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు:

తాజాగా మహ్మద్ కైఫ్ స్పోర్ట్ స్క్రీన్ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడాడు. వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరి బ్యాటింగ్ ఎక్కువగా ఇష్టపడతావు అని కైఫ్‌ని ప్రశ్నించగా... 'విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తా' అని సమాధానం ఇచ్చాడు. 'కోహ్లీ, రోహిత్ ఇద్దరూ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు. వాళ్లకి ఇంకా చాలా భవిష్యత్ ఉంది. కోహ్లీ బ్యాటింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అతని రికార్డ్స్ అమోఘం. వన్డే, టీ20ల్లోనూ అదే జోరుని కొనసాగిస్తున్నాడు' అని కైఫ్‌ తెలిపాడు.

 రోహిత్ బ్యాటింగ్‌ని ఎంజాయ్ చేస్తా:

రోహిత్ బ్యాటింగ్‌ని ఎంజాయ్ చేస్తా:

'విరాట్ కోహ్లీ బాగా ఆడినా.. రోహిత్ శర్మ ఆటని చూడటాన్నే నేను ఎక్కువగా ఇష్టపడతా. ఒకే నగరంలో ఒకేసారి రెండు వేర్వేరు జట్లకు కోహ్లీ, రోహిత్ ఆడితే.. హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌నే చూస్తా. రోహిత్ బ్యాటింగ్‌ని నేను ఎక్కువగా ఆస్వాదిస్తా. ఎటువంటి సందేహం లేదు విరాట్ టెస్టులు మరియు వైట్ బాల్ క్రికెట్ రెండింటిలోనూ అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నాడు. అయితే రోహిత్ మంచి బ్యాటింగ్ శైలి కలిగి ఉంటాడు' అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

జడేజా మంచి ఫీల్డర్:

జడేజా మంచి ఫీల్డర్:

'ఒక ఫీల్డర్ పూర్తి ప్యాకేజీ కలిగిఉన్నాడంటే.. మంచి క్యాచర్, తరచూ స్టంప్‌లను కొట్టాలి, వేగంగా పరిగెత్తగలగాలి, కదిలే బంతిని పట్టుకోవటానికి సరైన టెక్నిక్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతడు మంచి ఫీల్డర్. మేము ఆడిన రోజుల్లో నేను, యువరాజ్ మంచి ఫీల్డర్లుగా గుర్తింపు పొందాం. భారత జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లు ఉన్నారు. అయితే ఫీల్డర్‌గా పూర్తి ప్యాకేజీ ఎవరికీ లేదని నా అభిప్రాయం. రవీంద్ర జడేజా మంచి ఫీల్డర్. అతని ఫీల్డింగ్ కూడా రోజురోజుకు మెరుగుపడుతోంది' అని కైఫ్‌ పేర్కొన్నాడు.

ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే అభిమానులు గుర్తించారు:

ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే అభిమానులు గుర్తించారు:

'నా ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే అభిమానులు నన్ను గుర్తించారు. ఫీల్డింగ్‌తో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల నుంచి గౌరవం అందుకున్నా. వారిద్దరు నన్ను చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. మొహమ్మద్ అజారుద్దీన్, రాబిన్ సింగ్‌లు కూడా మంచి ఫీల్డర్లు' అని మాజీ క్రికెటర్ అన్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడని, అతడు గనుక తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే అద్భుతాలు చేయగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ కన్నా.. సచిన్ టెండూల్కర్ ఇష్టమైన క్రికెటర్ అని చెప్పాడు.

Story first published: Monday, May 11, 2020, 11:28 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+