ధోనీలో ఇంకా చాలా ఆట మిగిలుంది.. ప్రపంచకప్‌లో ఆడాలి: కైఫ్

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్-13 నిరవధిక వాయిదా పడగా.. నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు వీడియో కాన్ఫరెన్స్, చిట్‌చాట్ లాంటి షోలలో పాల్గొని తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుతున్నారు. కొందరు అతడి భవిష్యత్తుపై, మరికొందరు అతడి సామర్థ్యంపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా చేరాడు.

ధోనీపై చర్చలు జరుగుతున్నాయి:
ఎంఎస్ ధోనీకి మహమ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ధోనీలో ఇంకా చాలా ఆట మిగిలిఉందన్నాడు. ఐపీఎల్ ద్వారా ధోనీని అంచనా వేయడం సరికాదని, అతడు అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని అన్నాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ధోనీ ఆడాలని బుధవారం ఓ ఇంటర్వ్యూలో కైఫ్ అభిప్రాయపడ్డాడు. 'ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడబోతున్నాడో, టీ20 ప్రపంచకప్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌లో ధోనీ ప్రదర్శన చూశాక టీ20 ప్రపంచకప్‌లో చోటుపై చర్చలు జరుగుతాయని చాలా మంది అంటున్నారు. కానీ నేను అలా ఆలోచించడం లేదు' అని కైఫ్ అన్నాడు.

ఐపీఎల్ ఫామ్‌ను బట్టి అంచనా వేయడం సరికాదు:
'ఐపీఎల్ ఫామ్‌ను బట్టి ధోనీని అంచనా వేయడం సరికాదు. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. అందుకే ఐపీఎల్ ఆడాలనుకుంటున్నాడు, కెప్టెన్సీ చేయాలనుకుంటున్నాడు. అందుబాటులోనే ఉన్నానని చెప్పాలనుకుంటున్నాడు. మానసికంగా ధోనీ విజయం సాధిస్తూనే ఉన్నాడు. అలాగే ఒత్తిడిలో మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో కూడా అతడికి తెలుసు' అని కైఫ్ చెప్పాడు.

ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది:
'2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌ను ధోనీ గెలిపిస్తాడన అందరూ అనుకున్నారు. కానీ అలా జరగపోవడంతో చాలా మంది అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నా దృష్టిలో ధోనీ చాంపినయన్ ప్లేయర్. అతడి 10-15 ఏళ్ల రికార్డును అందరూ చూడండి. ప్రస్తుత ఫామ్ కూడా ముఖ్యమే. జట్టు నుంచి తప్పించేంత చెత్త ఫామ్‌లో ధోనీ లేడు. అతడిని పక్కన పెట్టడం సరికాదని నేను అనుకుంటున్నా. ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఆటగాడు ఇంత సుదీర్ఘకాలం ఆడితే ఒడిదొడుకులు సాధారణం. ధోనీకే కాదు ప్రతి క్రికెటర్‌కు ఇది జరుగుతుంది' అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

9 నెలలు ఆటకు దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ రాహుల్‌కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications