For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammad Kaif : ఈ సీజన్లో సీఎస్కే చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే

Mohammad Kaif Says CSK Didnt Qualify Due To Devon Conway Not In CSK Playing 11

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చివరి మూడు మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాలకు కీలక కారణం.. సీఎస్కే ఓపెనింగ్ జోడీ రుతురాజ్ గైక్వాడ్ - డెవాన్ కాన్వే. జడేజా తప్పుకున్నాక ధోనీ తిరిగి కెప్టెన్సీని పునఃప్రారంభించినప్పటి నుండి సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓపెనర్లు వరుసగా యాభై-ప్లస్ పార్ట్‌నర్‌షిప్‌లు నమోదు చేశారు. రెండు సార్లు వందకు పైగా పార్ట్‌నర్‌షిప్‌ ఇచ్చారు. ఆదివారం నవీ ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాన్వే, గైక్వాడ్ జోడీ 110పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై 91పరుగుల భారీ తేడాతో విజయం సాధించగలిగింది. సీఎస్కే విజయం అనంతరం భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన అతి పెద్ద తప్పును ఎత్తిచూపాడు.

ఒక్క మ్యాచ్ తర్వాత కాన్వేను పక్కన పెట్టేశారు

ఒక్క మ్యాచ్ తర్వాత కాన్వేను పక్కన పెట్టేశారు

సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌లో గత సీజన్లో ఓపెనర్‌గా ఉన్న ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ పాత్రను డెవాన్ కాన్వే పోషిస్తాడని తొలుత అంతా అనుకున్నారు. ఆ తర్వాత దీపక్ చాహర్ గాయం వల్ల చెన్నై ప్లేయింగ్ XI ఎంపికలు పూర్తిగా మారిపోయాయి. అది జట్టు కూర్పును కూడా ప్రభావితం చేసింది. సీజన్లో మార్చి 26న జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సీఎస్కే తలపడగా.. ఆ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన డెవాన్ కాన్వే కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత అతనికి జట్టులో చోటు దక్కలేదు. అతన్ని పలు మ్యాచ్‌ల్లో సీఎస్కే బెంచ్‌కే పరిమితం చేసింది. ఇక మధ్యలో ఈ న్యూజిలాండ్ బ్యాటర్ తన పెళ్లి కోసం బయోబబుల్‌ను విడిచి దక్షిణాఫ్రికాకు వెళ్లి తన ప్రేయసిని వివాహమాడాడు. తిరిగి మళ్లీ బయోబబుల్‌లోకి వచ్చాక అతనికి ధోనీ సారథ్యంలో ప్లేయింగ్ XIలో మళ్లీ చోటుదక్కింది. దీంతో కాన్వే గత మూడు మ్యాచ్‌లలో 161.7 స్ట్రైక్ రేట్‌తో 141బంతుల్లో 228 పరుగులు చేశాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఆ తప్పిదం వల్లే సీఎస్కేకు ప్లేఆఫ్ రేసులో ఈ పరిస్థితి

ఆ తప్పిదం వల్లే సీఎస్కేకు ప్లేఆఫ్ రేసులో ఈ పరిస్థితి

డెవాన్ కాన్వే బ్యాటింగ్ గురించి, చెన్నై అతన్ని పక్కన పెట్టడంపై కైఫ్ మాట్లాడుతూ.. కేవలం ఒక్క వైఫల్యం తర్వాత కాన్వేని తుది జట్టులోకి తీసుకోకకపోవడం తప్పని అభిప్రాయపడ్డాడు. ఆ తప్పిదం వల్ల ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్ రేసులో దాదాపు అవకాశాన్ని సీఎస్కే కోల్పోవడంపై చింతిస్తున్నానని తెలిపాడు. 'కేవలం ఒక మ్యాచ్‌లో ఆడకపోవడంతో కాన్వేను జట్టులో నుంచి తొలగించారు. ప్రస్తుతం అతను బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే.. సీఎస్కే తప్పక పశ్చాత్తాపపడుతుంది. తమ స్క్వాడ్‌లో చాలా మంచి ఆటగాడున్నాడు కానీ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని సీఎస్కే భావిస్తుంది. కాన్వే క్లాస్ ప్లేయర్. అతను పకడ్బందీగా అన్ని రకాల స్ట్రోక్‌లను కలిగి 360డిగ్రీల్లో షాట్‌లు ఆడగలడు. బౌలర్లకు అతను ఎలాంటి స్ట్రోక్ ఆడబోతున్నాడో కూడా అంతుబట్టదు' అని కైఫ్ సీఎస్కే తప్పిదాన్ని వివరించాడు.

ధోనీ కెప్టెన్సీ చేపట్టడం కూడా రెండు విజయాలకు ప్రధాన కారణం

ధోనీ కెప్టెన్సీ చేపట్టడం కూడా రెండు విజయాలకు ప్రధాన కారణం

ప్లేఆఫ్ రేసులో సీఎస్కే ఇంకా మాథమేటికల్లీ సజీవంగానే ఉంది. ఢిల్లీపై భారీ విజయం తర్వాత చెన్నైకి పాజిటివ్ నెట్ రన్‌రేట్‌ వచ్చింది. దిగువ స్థానాల్లో ఉన్న ఇతర జట్లతో పోలిస్తే సీఎస్కేకు పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉండడం కొంత సానుకూలాంశం. ధోనీ తిరిగి కెప్టెన్‌గా తిరిగి రావడం కూడా చివరి మూడు గేమ్‌లలో సీఎస్కే రెండు విజయాలు సాధించడానికి ముఖ్యమైన కారణం అని కైఫ్ పేర్కొన్నాడు. 'ధోనీ కెప్టెన్‌ అయ్యాక సీఎస్కేలో పెద్ద తేడా కన్పించింది. అతను టాస్ కోసం గ్రౌండ్లోకి వెళ్లినప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు ఈలలు, కేకలతో హోరెత్తిస్తారు. మ్యాచ్ స్టార్టింగ్‌కు ముందే అతను మ్యాచ్‌పై ప్రభావం చూపుతాడు. ఐపీఎల్ ఫస్టాఫ్‌లో సీఎస్కే ధోనీ కెప్టెన్సీని కోల్పోయింది. ధోనీ సారథ్యంలోని మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి మళ్లీ సీఎస్కే ఫామ్‌లోకి వచ్చింది.' అని కైఫ్ చెప్పాడు.

Story first published: Monday, May 9, 2022, 16:39 [IST]
Other articles published on May 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+