Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL Eliminator: లక్నో సూపర్ జెయింట్స్‌దే విజయం.. ఎందుకో కారణాలు చెప్పిన మహమ్మద్ కైఫ్

Mohammad Kaif predicts that Lucknow will have a better chance of winning the eliminator match

ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌కు ఆర్సీబీ కంటే కొంచెం ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ మెరుగైన బౌలింగ్ ఎటాక్ కలిగి ఉందని, బ్యాటింగ్ విషయంలో కూడా ఆర్సీబీతో పోలిస్తే స్వల్ప ఎడ్జ్ లక్నోకు ఉందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇకపోతే లీగ్ దశలో స్వతహాగా ప్లేఆఫ్ బెర్త్ సాధించి లక్నో మూడో స్థానంలో నిలిచిందని, ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం వల్ల ఆర్సీబీ లక్కీగా 4వ స్థానంలో చేరి ప్లేఆఫ్‌కు అర్హత సాధించగలిగిందని పేర్కొన్నాడు.

ఆర్సీబీ బౌలింగ్ చాలా వీక్

ఆర్సీబీ బౌలింగ్ చాలా వీక్

ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు కైఫ్ మాట్లాడుతూ.. 'ప్రాథమికంగా చెప్పాలంటే లక్నో బౌలింగ్ మెరుగ్గా ఉంది. ఆర్సీబీ చాలా బలహీనంగా ఉంది. గత మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ కూడా ఆ జట్టులో నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో సిద్దార్థ్ కౌల్ వచ్చి 4 ఓవర్లలో 40పరుగులు ఇచ్చాడు. ఇది చాలా ఎక్స్ పెన్సివ్ స్పెల్. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో హేజిల్‌వుడ్‌ తప్పా మిగతా ఆర్సీబీ బౌలింగ్ లైనప్ బలహీనంగా కన్పిస్తుంది. ఆర్సీబీతో పోల్చితే లక్నో బౌలింగ్ మెరుగ్గా ఉంది. కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్లో చాలా ఎక్కువ స్కోరు చేయాల్సి ఉంటుంది. వీలయినన్నీ ఎక్కువ సిక్సర్లు కొట్టాలి. అప్పుడే ఆర్సీబీ మ్యాచ్ గెలిచే వీలుంటుంది. ఇది చాలా టఫ్ ఫైట్, అయితే లక్నో బ్యాటింగ్ లైనప్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. లక్నో ఓపెనర్లు రాహుల్, క్వింటన్ డి కాక్ మంచి భీకర ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ వారిద్దరిని అడ్డుకట్ట వేయడానికి ఇంకా కష్టపడాలి అని' కైఫ్ పేర్కొన్నాడు.

గ్లెన్ మ్యాక్స్ వెల్, కోహ్లీ ఫామ్ కనబర్చినా..

గ్లెన్ మ్యాక్స్ వెల్, కోహ్లీ ఫామ్ కనబర్చినా..

ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్ వెల్ తన చిన్న చిన్న స్కోర్లను బిగ్ గా మలచాల్సిన అవసరముంది. విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లాగే తన ఫామ్‌ను కొనసాగించాలి. అయినప్పటికీ నా అభిప్రాయం ప్రకారం.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 100శాతంలో 60శాతం గెలిచే అవకాశం ఉంది. ఆర్సీబీకి 40శాతం మాత్రమే వీలుంది.' అని అభిప్రాయపడ్డారు. 'ఇక కేఎల్ రాహుల్ మరింత స్వేచ్ఛతో ఆడాలని, కెప్టెన్సీ భారాన్ని ఫీలయ్యి నెమ్మదిగా ఆడొద్దని సూచించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటూ బాల్స్ మింగొద్దని, ఒత్తిడిని తీసుకోవద్దని, రాహుల్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఆ ఫామ్ ఉపయోగించుకుని అటాకింగ్ గేమ్ ఆడాలని' కైఫ్ సూచించాడు.

 ఎలాంటి పొరపాట్లు చేసినా అంతే

ఎలాంటి పొరపాట్లు చేసినా అంతే

'ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడినట్లయితే.. చాలా ఒడిదొడుకుల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. తొలిసారి ఐపీఎల్లో ఆ జట్టు ఆడుతుంది. రాహుల్ జట్టును ప్లేఆఫ్స్‌ వరకు తీసుకువచ్చాడు. అతను తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో అద్భుతంగా కన్పిస్తున్నాడు. కానీ అతని ఫామ్‌కి ఈరోజు నిజమైన పరీక్ష ఉంటుంది, ఎందుకంటే ఈరోజు మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేసినా అది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయొచ్చు. కాబట్టి లక్నోకు అన్ని విషయాలు ఫేవర్ గా ఉన్నాయి. ఈ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు అంటూ కైఫ్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 25, 2022, 16:56 [IST]
Other articles published on May 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+