Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డిన్న‌ర్ ఎక్క‌డ చేద్దాం స్వీట్‌హార్ట్.. రిప్లై కోసం ఎదురుచూస్తుంటా: మాజీ క్రికెటర్

Mohammad Kaif Posts Witty Message For Wife As Her Birthday Falls Amid Lockdown

ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక లాక్‌డౌన్ సందర్భంగా ఆటగాళ్లు అందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల దాకా పుట్టిన రోజు వేడుక‌లు, ఇత‌ర‌త్రా శుభ‌కార్యాలు ఎవ‌రి ఇంట్లో వారే జ‌రుపుకుంటున్నా.. కొంద‌రు వినూత్నంగా జ‌రుపుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ చేరిపోయాడు.

 డిన్న‌ర్ ఎక్క‌డ చేద్దాం స్వీట్‌హార్ట్:

డిన్న‌ర్ ఎక్క‌డ చేద్దాం స్వీట్‌హార్ట్:

మంగ‌ళ‌వారం మ‌హ్మ‌ద్ కైఫ్ భార్య పూజా కైఫ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మ‌హ్మ‌ద్ కైఫ్ ట్విట‌ర్‌లో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపాడు. 'నా జీవిత భాగ‌స్వామి పూజా కైఫ్‌కు ఇవే నా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఈరోజు డిన్న‌ర్ ఎక్క‌డ చేద్దాం స్వీట్‌హార్ట్. త్వ‌ర‌గా చెప్పు నీ రిప్లై కోసం ఎదురుచూస్తుంటా' అంటూ కైఫ్‌ పేర్కొన్నాడు. అయితే కైఫ్ భార్య పూజా నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. మహ్మద్‌ కైఫ్‌ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు.

ఇంట్లోనే డిన్న‌ర్ చేయండి:

మ‌హ్మ‌ద్ కైఫ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. 'బ‌య‌ట క‌రోనా ఉంది.. ఇంట్లోనే డిన్న‌ర్ చేయండి' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'అదేంటి కైఫ్ అదేం ప్ర‌శ్న‌.. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద చేయండి' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. 'క‌రోనా పుణ్య‌మా అని మీకు అదృష్టం క‌లిసొచ్చింది'.. 'హాయిగా మీ భార్య‌కు వండిపెట్టి సంతోషంగా తినండి' అంటూ కామెంట్లు పెట్టారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్.. కైఫ్ భార్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

యువీ ఔటవ్వగానే ఓడిపోతామనుకున్నా:

యువీ ఔటవ్వగానే ఓడిపోతామనుకున్నా:

లాక్‌డౌన్ సందర్భంగా నాటి చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకున్న కైఫ్‌, యువీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైఫ్‌ మాట్లాడుతూ నాట్‌వెస్ట్‌ సిరీస్‌-2003 ఫైనల్ మ్యాచ్‌లో యువీ ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని అనుకున్నట్లు చెప్పాడు. 'యువీ ఆరోజు నువ్వు ఔటవ్వగానే మ్యాచ్‌ ఓడిపోతామనుకున్నా. మనం గెలుస్తామనుకోలేదు. అప్పటికే నేను కుదురుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు. దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలుస్తామని భావించా. కానీ.. నువ్వు ఔటయ్యేసరికి చాలా నిరాశ చెందా' అని కైఫ్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

Story first published: Wednesday, April 22, 2020, 13:29 [IST]
Other articles published on Apr 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+