Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కెప్టెన్‌గా శ్రేయ‌స్ నిర్ణ‌యాలు సూప‌ర్.. అత‌డిని జ‌ట్టులోకి తీసుకోవ‌డం మంచి నిర్ణ‌యం

Mohammad Kaif has lauded the captaincy of Shreyas Iyer for making a wise decision to include Umesh Yadav in the squad.

కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై మాజీ క్రికెట‌ర్ మహ్మద్ కైఫ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఐపీఎల్ 2022లో చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో అత‌ను తీసుకున్న నిర్ణ‌యాల‌ను కొనియాడాడు. ముఖ్యంగా సీనియ‌ర్ పేస‌ర్ ఉమేష్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని అన్నాడు. ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

ఉమేష్ యాద‌వ్‌ను ఆడించ‌డం తెలివైన నిర్ణ‌యం

తొలి మ్యాచ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీ బాగుంద‌ని, కేకేఆర్ తుది జట్టులోకి సీనియ‌ర్ పేస‌ర్ ఉమేష్ యాద‌వ్‌ను తీసుకోవ‌డం తెలివైన నిర్ణ‌యమ‌ని టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ అన్నాడు. గ‌తంలో ఉమేష్ యాద‌వ్ కేకేఆర్ జ‌ట్టుకే ఆడిన‌ప్ప‌టికీ అత‌నికి స‌రైన అవ‌కాశాలు రాలేద‌ని గుర్తు చేశాడు. అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ మాత్రం ఉమేష్ యాద‌వ్‌పై నమ్మ‌కం ఉంచి అతడిని తుది జ‌ట్టులోకి తీసుకున్నాడ‌ని అన్నాడు. అలాగే ఉమేశ్ యాద‌వ్‌తోపాటు శివమ్‌ మావి, ఆండ్రీ రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్ బౌలింగ్ సేవలను కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స‌రిగ్గా ఉపయోగించుకున్నాడ‌ని మ‌హ్మ‌ద్ కైఫ్ చెప్పాడు.

ర‌హానే టైమింగ్‌పై దృష్టి పెట్టాడు

టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ అజింక్యా ర‌హానే ఆడిన ఇన్నింగ్స్‌పై కూడా మ‌హ్మ‌ద్ కైఫ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ' 'రహానే నుంచి ఇది ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్. టార్గెట్‌ పెద్దది కాదు. కాబట్టి అతను సమయాన్ని వెచ్చించి తన టైమింగ్‌పై దృష్టి పెట్టాడు. వాంఖడే అతని సొంత మైదానం. ఉపరితలంపై కొంచెం బౌన్స్ ఉన్నప్పుడల్లా, అతను బాగా రాణిస్తున్నాడు. అతను శనివారం చక్కగా బ్యాటింగ్ చేశాడు. ' ' అని మ‌హ్మ‌ద్ కైఫ్ అన్నాడు.

కొత్త జ‌ట్ల రాక‌తో ఆట‌గాళ్ల విలువ పెరిగింది

రహానే, ఉమేష్ యాద‌వ్‌, షెల్డన్ జాక్సన్ గత 2-3 సంవత్సరాలుగా ఐపిఎల్‌లో క్రమం తప్పకుండా ఆడటం లేదనే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని మ‌హ్మ‌ద్ కైఫ్ అన్నాడు. ఉమేష్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టులో ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేద‌ని, అదే జ‌ట్టులో ఉన్న‌ రహానే కూడా గ‌త సీజ‌న్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడ‌ని గుర్తు చేశాడు. రెండు కొత్త జట్లు రావడం వల్ల ఆటగాళ్ల విలువ పెరిగింద‌ని చెప్పుకొచ్చాడు. వారు ప్ర‌స్తుతం మరిన్ని అవకాశాలను పొందుతార‌ని కైఫ్ అన్నాడు.

కేకేఆర్ విజ‌యం

ఇక చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు విజ‌యంలో ఉమేష్ యాద‌వ్, అజింక్యా ర‌హానే కీల‌క పాత్ర పోషించారు. 20 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన ఉమేష్ ఓపెన‌ర్ల వికెట్ల‌ను తీశాడు. ముఖ్యంగా గ‌త సీజ‌న్లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అందుకున్న రుతురాజ్ గైక్వాడ్‌ను డ‌కౌట్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో అజింక్యా ర‌హానే కోల్‌క‌తాకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ క్ర‌మంలో 34 బంతుల్లోనే 44 ప‌రుగులు చేశాడు.

Story first published: Sunday, March 27, 2022, 17:07 [IST]
Other articles published on Mar 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+