|
23 బంతుల్లో 44 పరుగులు:
ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో రవీంద్ర జడేజా(66), హార్దిక్ పాండ్యా (92)తో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పగా.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే చివరి ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి అతడి తలకు బలంగా తాకింది. దీంతో జడ్డు మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కైఫ్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

11 ఏళ్లుగా ఆడుతున్నా:
'పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు రవీంద్ర జడేజా ఎంత విలువైన ఆటగాడో గత రెండు మ్యాచ్‌ల్లో నిరూపించుకున్నాడు. తన ఆటతో జట్టుకు సమతూకం తీసుకొచ్చాడు. 11 ఏళ్లుగా ఆడుతున్నా.. ఇంకా జడేజాను చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పుడు లభిస్తున్న గౌరవం కన్నా ఇంకా ఎక్కువే దక్కాల్సి ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో టీమిండియా అతడి సేవల్ని కోల్పోనుందని అనిపిస్తోంది' అంటూ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

గాయం తీవ్రత దృష్ట్యా:
19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడిన జడేజా ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద చహల్‌ను జడేజా స్థానంలో తీసుకువచ్చారు. జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టీ20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశారు.

మంచి ఫీల్డర్‌గా, పార్ట్ టైమ్ స్పిన్నర్:
రవీంద్ర జడేజా భారత జట్టు వన్డే, టీ20, టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. మంచి ఫీల్డర్‌గా, పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా సేవలందిస్తూనే జట్టు క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ చేసి ఆదుకుంటున్నాడు. బౌలింగ్‌లో కొన్నిసార్లు విఫలమైనా.. బ్యాటింగ్‌లో మాత్రం గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా భాగస్వామ్యల్ని నిర్మించడంతో పాటు స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేస్తూ జట్టును ఆడుకుంటున్నాడు. జడేజా భారత్ తరఫున 49 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ బాదాడు.
Happy Birthday Shikhar Dhawan: 100% నిజాయితీ, 200% వినోదం, 300% ఆనందం= గబ్బర్