ధోనీ తాలా అయితే, కోహ్లీ కింగ్ అయితే.. మరీ ధావన్ ఏం కావాలో చెప్పిన మహమ్మద్ కైఫ్

ఐపీఎల్ - 2022 సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ నాలుగు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయంలో ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. 59బంతుల్లో అజేయంగా 88పరుగులు చేశాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తన ఇన్సింగ్స్‌తో ధావన్ ఐపీఎల్లో 6,000పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ తర్వాత ఆరు వేల పరుగుల మైలురాయిని దాటిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ధావన్ కన్సిస్టెన్సీ, ఫామ్, బ్యాటింగ్‌లో సమర్థంగా రాణించడం చూస్తే.. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టుకు అతను ఎంపిక కావడం ఖాయమని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ధావన్ సూపర్ బ్యాటింగ్ ప్రదర్శనను కైఫ్ కొనియాడాడు.

ధావన్‌కు ఓ బిరుదు
ఇప్పటికే ఐపీఎల్లో రాణిస్తున్న టీమిండియా ప్లేయర్లకు ఓ సుస్థిర బిరుదులు ఉన్నాయి. ఈ క్రమంలో ధావన్‌కు సరికొత్త బిరుదును కైఫ్ ఇచ్చాడు. 'ధోనీని తాలా అంటారు, కోహ్లీని కింగ్ అంటారు. మరీ శిఖర్ ధావన్‌ను ఏమని పిలవాలి. ఆరువేల పరుగుల మైలురాయి చేరడం, ఒత్తిడిలో రాణించడం చూస్తే.. అతను టీ20కా ఖలీఫా అని పేర్కొనవచ్చు' అన్నాడు.

ఆ విషయం నన్ను అడగొద్దు
ఇక ధావన్ ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అవుతాడా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో కైఫ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 'ఇప్పుడున్న ఫాం, అతని బ్యాటింగ్ నైపుణ్యం ప్రకారం.. ధావన్ టీ20 ప్రపంచకప్ ఆడాలి. ఈ విషయం గురించి ఇంకా నన్ను అడగవద్దు. ఎందుకంటే నేనే సెలెక్టర్ అయితే.. ధావన్ సెలెక్ట్ అవుతాడనే విషయాన్ని చెప్పేవాడిని' అని కైఫ్ ట్వీట్ చేశాడు.

మరో పది మ్యాచ్‌లలో కోహ్లీని దాటేస్తాడు
సోమవారం జరిగిన మ్యాచ్ ధావన్‌కి 200వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న ఎనిమిదో క్రికెటర్‌గా అతను రికార్డులకెక్కాడు. పరుగుల విషయానికొస్తే.. కోహ్లీ (6411)పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తొలిస్థానంలో ఉండగా.. ధావన్ (6086)పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ కంటే ధావన్ 325పరుగుల వెనకాల ఉన్నాడు. ప్రస్తుత కోహ్లీ ఫామ్, ధావన్ ఫామ్ బేరీజు వేసుకుంటే.. మరో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావన్ కోహ్లీని దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ధావన్ చెన్నై సూపర్ కింగ్స్ మీద కొన్ని రికార్డులను కలిగి ఉన్నాడు. చెన్నైతో జరిగిన 28 మ్యాచ్‌ల్లో 44.73 సగటుతో, 130.74 స్ట్రైక్ రేట్‌తో 1,029పరుగులు చేశాడు. చెన్నైపై 1000కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే చెన్నెపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ధావన్ కొనసాగుతున్నాడు. ధావన్ తర్వాతి స్థానంలో 39.54సగటుతో 28ఇన్నింగ్స్‌లలో 949పరుగులు చేసిన కోహ్లీ ఉన్నాడు. అలాగే సూపర్ కింగ్స్‌పై 114ఫోర్లు కొట్టిన ధావన్.. చెన్నైపై 100కంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications