For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీలక ఆటగాళ్లకు దక్కని చోటు.. కైఫ్ ఆసియా కప్ జట్టు ఇదే!

Asia Cup 2025: భారత క్రికెట్ జట్టుకు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఒకటి అయిన ఆసియా కప్ టీ20 సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి 27 వరకు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం భారత జట్టును వచ్చే మంగళవారం ముంబైలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా, టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న శుభ్‌మన్ గిల్‌కు టీ20 జట్టులో మళ్లీ అవకాశం లభిస్తుందా అనే అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఆసియా కప్‌లో భారత జట్టు బరిలోకి దిగనుంది.

కైఫ్ ఎంపిక.. శుభ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యత
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆసియా కప్ కోసం తన దృష్టిలో ఉండాల్సిన భారత జట్టును ఎంపిక చేశాడు. ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు దక్కుతుందని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి 754 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఐపీఎల్ లో కూడా అతను నిలకడగా రాణించాడు. ఈ ప్రదర్శనను బట్టి శుభ్‌మన్ గిల్ ఆసియా కప్ జట్టులో తప్పకుండా ఉండాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు కైఫ్ చెప్పాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోయినా, జట్టులో ఒక బ్యాకప్ ఓపెనర్‌గా అతను ఉండటం అవసరం. ఒకవేళ ఏ ఓపెనర్‌కైనా గాయమైతే.. శుభ్‌మన్ గిల్ ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంటాడు. మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ అద్భుతంగా రాణించినందుకు వారికి ఈ అవకాశం లభించాలని తాను కోరుకుంటున్నట్లు మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

Mohammad Kaif announces his 15-member squad for Asia Cup 2025

అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు చోటు
వైస్ కెప్టెన్సీ పదవి గురించి మాట్లాడుతూ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీని ఇవ్వాలని మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన తమిళనాడు ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌‌ను కూడా జట్టులో ఎంపిక చేయాలని కోరాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం దక్కని కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లను కూడా జట్టులో చేర్చాలని మహ్మద్ కైఫ్ బలంగా సూచించాడు.

మహ్మద్ కైఫ్ ఎంపిక చేసిన భారత జట్టు ఇది.
1.సంజు శాంసన్ (కెప్టెన్), 2. అభిషేక్ శర్మ, 3. తిలక్ వర్మ, 4. సూర్యకుమార్ యాదవ్, 5. హార్దిక్ పాండ్యా, 6. అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), 7. జితేష్ శర్మ, 8. శివం దూబే, 9. వాషింగ్టన్ సుందర్, 10. కుల్దీప్ యాదవ్, 11. అర్ష్‌దీప్ సింగ్, 12. జస్ప్రీత్ బుమ్రా, 13. వరుణ్ చక్రవర్తి, 14. శుభ్‌మన్ గిల్, 15. మహమ్మద్ సిరాజ్.

Story first published: Sunday, August 17, 2025, 17:54 [IST]
Other articles published on Aug 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+