Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 ఓవర్లు.. 1 పరుగు.. 2 వికెట్లు

Mohammad Irfan creates T20 history, still ends up on losing side

సెయింట్ కిట్స్: క్రికెట్‌లో షార్ట్ ఫార్మాట్ అయిన టీ20లో రికార్డులు నమోదవడం పరిపాటే. అలాంటి క్రమంలోనే వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. దానికి కారణం.. పాకిస్థాన్ పేస్‌బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్. టీ20ల చరిత్రలో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

కరీబియన్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ ఈ రికార్డు నెలకొల్పాడు. అతడు వరుసగా 23 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. చివరికి నాలుగు ఓవర్లలో కేవలం ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. అయితే ఇర్ఫాన్ ఇంత అద్భుతమైన బౌలింగ్ చేసినా.. తన టీమ్ బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.

సెయింట్ కిట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బార్బడోస్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్.. 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. కెప్టెన్ జేస్ హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన సెయింట్ కిట్స్.. 18.5 ఓవర్లలో టార్గెట్ చేజ్ చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి బంతికే ఔటైనా.. ఆ జట్టు గెలవడం విశేషం. బ్రాండన్ కింగ్ 49 బంతుల్లో 60 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

జట్టు ఓడినా ఇర్ఫాన్‌నే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు వరించింది. ఈ మ్యాచ్ విజయంతో సెయింట్ కిట్స్.. నెవిస్ పాట్రియోట్స్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ముగిసిన లీగ్‌ పట్టికలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన బార్బొడోస్ ట్రైడెంట్స్ ఐదో స్థానంలో నిలిచింది.

Story first published: Sunday, August 26, 2018, 16:10 [IST]
Other articles published on Aug 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+