Watch Video: లైవ్ మ్యాచ్‌లో పాక్ ఆటగాడి సిగ్గుచేటు చర్య (వీడియో)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ట్రై-సిరీస్‌లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నప్పటికీ.. జట్టులో అంతర్గత సమస్యలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే టాపార్డర్ బ్యాటర్ మహ్మద్ హారిస్ ప్రవర్తన. పాకిస్థాన్ కొత్త కోచ్ మైక్ హెస్సన్ అతడిని కింది వరుసలో బ్యాటింగ్‌కు పంపించే నిర్ణయం సరైనది కాదని తేలింది. ఈ అసంతృప్తి ట్రై-సిరీస్‌లో భాగంగా జరిగిన యూఈఏతో మ్యాచ్‌లో బయటపడింది.
బ్యాటింగ్ విఫలమైన మహ్మద్ హారిస్ తన కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. అతను బ్యాట్‌ను నేలకేసి గట్టిగా గట్టిగా కొట్టడంతో అది రెండు ముక్కలైంది. ఈ ఘటన లైవ్ మ్యాచ్‌లో జరగడం, కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక్క పరుగుకే ఔట్.. సహనం కోల్పోయిన మహ్మద్ హారిస్
శనివారం యూఏఈతో జరిగిన ట్రై-సిరీస్ రెండో మ్యాచ్‌లో మహ్మద్ హారిస్ తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. కేవలం రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి మహ్మద్ జవాదుల్లా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఈ సంఘటన 17వ ఓవర్ మూడో బంతికి జరిగింది. 16.3 ఓవర్ల వద్ద మహ్మద్ హారిస్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోర్ 169 పరుగులు. హారిస్ జట్టు కోసం భారీ స్కోరు సాధించడంలో సహాయపడతానని అనుకున్నాడు. కానీ అనుకున్నది జరగకపోవడంతో అతని కోపం ఆకాశాన్నంటింది. మైదానం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు హారిస్ తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి పగలగొట్టాడు. దాని హ్యాండిల్ ఒక వైపు.. మిగిలిన భాగం మరో వైపు విరిగిపడ్డాయి.
పాకిస్థాన్‌కు వరుసగా రెండో విజయం
ఈ సంఘటన పక్కన పెడితే, ట్రై-సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వారు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆడించిన తర్వాత, యూఏఈని కూడా ఓడించి వరుసగా రెండో విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు చివరి ఓవర్లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. సయీమ్ అయూబ్, హసన్ నవాజ్ అద్భుతమైన అర్థ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత హసన్ అలీ, మహ్మద్ నవాజ్ ల అద్భుతమైన బౌలింగ్ కారణంగా యూఏఈని 176 పరుగులకే కట్టడి చేసి 31 పరుగుల తేడాతో విజయం సాధించారు.
ృ
ఈ విజయాలు పాకిస్తాన్ జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారని నిరూపించాయి. అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన, అంతర్గత సమస్యలు జట్టు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications