బాబర్ ఆజామ్ పెద్ద మనసు చేసుకుని ఆ పని చేయాలి.. ఇంకెన్నాళ్లు తన కంఫర్ట్ జోన్ చూసుకుంటాడు : మహమ్మద్ హఫీజ్

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పెద్ద మనసు ప్రదర్శించి.. తన కంఫర్ట్ జోన్‌ను విడిచిపెట్టాలని, భారత్‌తో మ్యాచ్‌కు ఓపెనర్‌గా కాకుండా వన్డౌన్ బ్యాటర్ (నం.3)గా రావాలని మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సూచనలు చేశాడు. చిరకాల ప్రత్యర్థులు అయిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ నేడు మరోసారి దుబాయ్ వేదికగా సూపర్ 4 స్టేజులో తలపడనున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో పాకిస్థాన్ టాపార్డర్ బ్యాటర్లు తమ నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా చాలా విమర్శలకు గురయ్యారు. ఆజామ్, రిజ్వాన్ హిట్టింగ్ చేయడానికి కష్టపడుతున్నారు. ఆజామ్ నిలదొక్కుకోవడం కూడా లేదు. ఆసియాకప్ టోర్నీలో రెండు మ్యాచ్‌లలో ఆజామ్ పూర్తిగా విఫలమయ్యాడు.

ఫాఖర్ జమాన్‌ను ఓపెనర్‌గా పంపిస్తే
ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అయిన మహమ్మద్ హఫీజ్ ఉద్దేశం ప్రకారం.. ఓపెనర్లలో దూకుడు లోపించిందని, వాళ్ల ఇంటెంట్ మారాలని లేకపోతే స్థానం మారితే కాస్త ప్రయోజనం ఉంటుంది. పీటీవీ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో హఫీజ్ మాట్లాడుతూ.. మాజీ కెప్టెన్ అయిన ఫాఖర్ జమాన్‌ను ఓపెనర్‌గా చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే అలాంటి మార్పు జరగాలంటే అది బాబర్ ఆజామ్ చేతిలో పని అని పేర్కొన్నాడు. ఆజాం తన కంఫర్ట్ జోన్‌ను వదిలి నెం.3స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని హఫీజ్ సూచించాడు.

అంతవరకు చర్చ మానేయాలి
'ఈ చర్చ కొంతకాలంగా జరుగుతోంది. రిజ్వాన్, బాబర్ ఆజామ్ సక్సెస్ రేట్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ వరకు వీళ్లను ఓపెనర్లుగా పంపించడానికి ఓకే. అంతవరకు ఈ విషయం గురించి చర్చించుకోవడం మానేయాలని నా అభిప్రాయం. వారిని ఓపెనర్లుగా ఆడనిద్దాం. వారు ఓపెనర్లుగా మెరుగుపరచుకోవాల్సిన విషయాలు వారి స్ట్రైక్ రేట్, అలాగే వాళ్ల ఆటలో చూపించాల్సిన ఇంటెంట్. ఆసియా కప్ టైంలో వాళ్లు తమ దూకుడు కనబర్చడం లేదు. ఇదిలాగే కొనసాగితే నా అభిప్రాయం ప్రకారం.. ఫాఖర్ జమాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. అయితే అందుకు బాబర్ కెప్టెన్‌గా పెద్ద మనసును ప్రదర్శించి, తన కంఫర్ట్ జోన్‌ని వదిలి నెం.3లో ఆడి లీడర్‌గా ఎదిగితేనే అది జరుగుతుంది.' అని హఫీజ్ చెప్పాడు.

మీరు, నేను అనుకుంటే అయ్యే పని కాదిది
ఇందుకు గల అంతిమ నిర్ణయం బాబర్ ఆజామ్ చేతిలో ఉందని, రిజ్వాన్ కుడిచేతి వాటం బ్యాటర్‌గా కొంతవరకు ఓపెనింగ్లో విజయవంతమవుతున్నాడని నేను ఇప్పటికీ భావిస్తున్నా. బాబర్ ఆజామ్ నంబర్ 3గా బరిలోకి దిగడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ అతను మాత్రమే ఈ నిర్ణయం తీసుకోగలడు. మీరు, నేను అనుకుంటే అయ్యే పని కాదిది. అతను రిజ్వాన్‌తో కలిసి ఓపెనర్‌గా విజయం సాధించాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. నా ఉద్దేశమేంటంటే.. వారి స్ట్రైక్ రేట్, ఇంటెంట్ మాత్రమే మెరుగుపడాలి' అని హఫీజ్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications