For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గుర్తింపులేదు: హెచ్‌సీఏపై అజహరుద్దీన్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‍‌సీఏ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‍‌సీఏ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

హెచ్‍‌సీఏలో చట్టవ్యతిరేక వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే హెచ్‍‌సీఏ సెలక్షన్ కమిటీకి ఎటువంటి అర్హత లేదని విమర్శించారు. ఆ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో మార్పులు జరగాలని అన్నారు.

mohammad azharuddin takes on hca

భారతీయ క్రికెటర్లకు హెచ్‍‌సీఏలో గుర్తింపు లేదన్న అజహరుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి కొందరు కూడా రంజీకి ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈ ఎంపిక లోథా కమిటీ సిఫారసుల మేరకు జరిగిందా? లేదా అర్థం కావడం లేదని అన్నారు.

ఎన్నికల తర్వాత హెచ్‍‌సీఏలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇది ఎవరినీ నిందించడానికి కాదని, హెచ్‍‌సీఏ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇంకా సమయం ఉందని అన్నారు. అప్పటి వరకు వేచి చూడాలని అన్నారు. తీర్పు వచ్చాక ఏం చేయాలో వెల్లడిస్తానని అజహరుద్దీన్ తెలిపారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+