Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెచ్‌సీఏ నిర్లక్ష్యం: మూడో టీ20 రద్దుపై అజారుద్దీన్ ఇలా

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 రద్దు అయిన సంగతి తెలిసిందే. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంఫైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అభిమానులు సైతం హెచ్‌సీఏ నిర్లక్ష్యపు ధోరణిపై మండిపడగా, తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ కూడా మండిపడ్డారు. మూడో టీ20 రద్దు అయిన తీరుపై అజారుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ అసమర్థంగా వ్యవహరించిందని అన్నారు.

Mohammad Azharuddin fires on hca over 3rd t20i abandoned

తొలిసారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కి మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న హెచ్‌సీఏ, ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేకపోయిందని అన్నారు. అంతలా వర్షం పడినప్పటికీ, గువహటి వేదికగా రెండో టీ20ని నిర్వహించారని, అలాంటిది హైదరాబాద్‌లో
మ్యాచ్‌ను నిర్వహించకపోవడం దారుణమని అజారుద్దీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

చెప్పాలంటే ఇది హెచ్‌సీఏకు సిగ్గుచేటు అని అన్నారు. ఉప్పల్‌లో వర్షం లేకున్నా.. మ్యాచ్‌ను నిర్వహించలేకపోవడం ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. నగరంలో గత పదిరోజులుగా వర్షం పడుతోందని, అలాంటి సందర్భంలో అందుకు తగిన జాగ్రత్తలు హెచ్‌సీఏ తీసుకుంటే బాగుండేదని అన్నారు.

అవుట్ ఫీల్డ్‌ను కప్పేందుకు సరిపడా కవర్లు లేకపోవడం వల్లనే ఈ మ్యాచ్‌ను కోల్పావాల్సి వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ మ్యాచ్‌ని కేటాయించాలంటే బీసీసీఐ తప్పక ఆలోచిస్తుందని అన్నారు. హెచ్‌సీఏ నిర్లక్ష్యం వల్లే అభిమానులు సైతం అసంతృప్తికి గురయ్యారని అన్నారు.

Mohammad Azharuddin fires on hca over 3rd t20i abandoned

తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ని నిర్వహించడంతో హెచ్‌సీఏ విఫలం కావడంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో హెచ్‌సీఏపై అసహనం వ్యక్తం చేశారు. 'హెచ్‌సీఏ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైంది. స్టేడియం నిర్వహకులు మ్యాచ్‌ను నిర్వహించడంలో విఫలమయ్యారు' అని ఓ నెటిజన్ అన్నారు.

'వారికి అసలు క్రికెట్‌పై ఆసక్తే లేదు, వర్షం లేకపోయినా మ్యాచ్‌ రద్దవడం హాస్యాస్పదం, హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పి ఉంచే కవర్లను అందజేస్తాం. బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్‌ స్టేడియం నిర్వాహకులకు కొని పెట్టండి' అంటూ ఛలోక్తులు విసిరారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+