Mohammad Azharuddin : వారిద్దరు అవసరమా.. వాళ్ల స్థానాల్లో షమీని, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాల్సింది

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక జట్టు సెలెక్షన్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అసహనం వ్యక్తం చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన మెయిన్ టీంలో శ్రేయాస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇకపోతే నిన్న ప్రకటించిన భారత జట్టు.. గతేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుతో పోలిస్తే చాలా భిన్నమైన బౌలింగ్ ఎటాక్ కలిగి ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన ఇద్దరు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఈసారి జట్టుకు ఎంపిక కాలేదు. ఇకపోతే బౌలింగ్ విభాగంలో.. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ ఉన్నారు. మొత్తం బౌలింగ్ పరంగా ఏడుగురును హార్దిక్‌తో కలిపితే ఎనిమిది మందిని చేర్చి బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేశారు.
వారిద్దరికి బదులు వీరిని ఎంపిక చేయాల్సింది
టీ20జట్టుకు ప్రధాన ఆప్షన్ కాదన్నట్లు కొంతకాలంగా మహమ్మద్ షమీని సెలెక్షన్ కమిటీ భారత జట్టుకు ఎంపిక చేయడం లేదు. అయితే ఈ దఫా అతను మెయిన్ స్క్వాడ్‌లో కాకుండా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అజారుద్దీన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అయ్యర్, షమీని ప్రధాన జట్టుకు ఎంపికకావాల్సిన వారని చెప్పాడు. 'శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీలను ప్రధాన జట్టు నుండి తప్పించడం పట్ల ఆశ్చర్యమేస్తోంది. దీపక్ హుడాకు బదులుగా శ్రేయాస్ అయ్యర్, హర్షల్ పటేల్ స్థానంలో మహమ్మద్ షమీని తీసుకోవాల్సింది అని నేను అనుకుంటున్నాను' అని అతను పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఒక్క గేమ్ కూడా ఆడలేదు
షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ తెగ ఇబ్బంది పడతాడనే సంగతి తెలిసిందే. ఆసీస్ పిచ్‌లపై అదనపు బౌన్స్ ఉండడంతో పాటు బౌలర్లు కూడా షార్ట్ పిచ్ బంతులతో నిప్పులు చెరుగుతారు. బహుశా ఇదే కారణంతో శ్రేయస్ అయ్యర్‌ను జట్టుకు ఎంపిక చేయలేదేమోనని తెలుస్తోంది. టీమిండియా టీ20 ఫార్మాట్‌కు షమీ ప్రధాన బౌలర్‌గా పరిగణించడం లేదని, అందువల్ల షమీని రిజర్వ్‌గా మాత్రమే ఎంపిక చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది షమీ భారత్ తరఫున ఒక్క టీ20 గేమ్ కూడా ఆడలేదు. టీ20 విభాగంలో స్పెషలిస్టులుగా పేరుపడ్డ కొందరిని జట్టుతో కొనసాగించడానికే సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపించింది. తొలిసారిగా టీ20 ప్రపంచకప్ కోసం దీపక్ హుడా భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా లేదనేది మాత్రం డౌటే.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
టాపార్డర్ : రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ,
మిడిలార్డర్ : సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్),
లోయర్ ఆర్డర్ : దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా,
స్పిన్నర్లు : అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్,
పేసర్లు : జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications