Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ఖతర్నాక్ ఆడావ్ బ్రో..’ హార్దిక్ పాండ్యాకు పాక్ మాజీ స్టార్ పేసర్ ప్రశంస

Mohammad Amir Tweeted About Hardik Pandyas Innings

దుబాయ్‌లో ఆదివారం జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఆసియా కప్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా భారత్‌ను గెలిపించిన విధానం ఒకానొక చరిత్రాత్మక ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది లాంటి పాక్ దిగ్గజాలు సైతం ఇరు జట్ల మధ్య తేడా ఏంటంటే.. భారత్‌కు హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. పాకిస్థాన్‌కు లేడు అంతే అనేలా వ్యాఖ్యానించారు.

బాల్‌తో, బ్యాట్‌తో మంచి ప్రదర్శనను కనబర్చిన హార్దిక్ చివరి ఓవర్ థ్రిల్లర్‌లో భారత్‌ను గెలుపు గీత దాటించి ఐదు వికెట్ల విజయానికి నడిపించాడు. పాండ్యా 25పరుగులకు 3వికెట్లు తీసుకున్నాడు. తన షార్ట్ పిచ్ బంతులతో పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంలోనూ హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఇక చివర్లో 17బంతుల్లో 33* పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత విజయాన్ని ఖాయం చేశాడు.

తాజాగా హార్దిక్‌ను ప్రశంసించిన ప్రముఖ క్రికెటర్ల జాబితాలో పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సైతం చేరాడు. హార్దిక్‌ చేసిన 'సెట్‌బ్యాక్ కంటే కమ్ బ్యాక్ గొప్పది' అనే ట్వీట్‌కు అమీర్ రిప్లే ఇచ్చాడు. ఇక అమీర్ రిప్లే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హార్దిక్ బాగా ఆడాడని పేర్కొంటూ 'వెల్ ప్లేయ్డ్ బ్రదర్' అంటూ అమీర్ ట్వీట్ చేశాడు.

హార్దిక్ ఖతర్నాక్ ఆడాడనే ఉద్దేశంలో చేసిన ఆ ట్వీట్ పట్ల నెటిజన్లు కామెంట్లు, రిట్వీట్లు చేస్తున్నారు. ఇకపోతే 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్ అమీర్.. మళ్లీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. అందుకు కొన్ని కండీషన్లకు ఒప్పుకోవాలంటూ గతంలో పాకిస్థాన్ బోర్డుకు వినతి చేసిన సంగతి తెలిసిందే.

అయితే బోర్డు మాత్రం ఉలుకుపలుకు లేకుండా అతని వినతిని హోల్డ్‌లో ఉంచింది. ఓ సిరీస్లో తనను తప్పించడంతో అలకబూనిన అమీర్ హుటాహుటిన పాక్ సెలెక్షన్ కమిటీ రాజకీయాలు చేస్తోందంటూ పోస్టుల మీద పోస్టులు పెట్టి ఇలాంటి కమిటీ ఎప్పటికీ తనను సెలెక్ట్ చేయదంటూ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అయితే తర్వాత బోర్డు స్పందించినా.. అమీర్ మాత్రం కొన్ని షరతులు పెడుతూ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటే ఆ షరతులకు అంగీకరించాల్సిందేనంటూ పట్టుబట్టాడు.

అందులో తనను రెగ్యులర్ ప్లేయర్‌గా కన్సిడర్ చేయలని.. బోర్డు నుంచి తనకు హయ్యర్ కాంట్రాక్ట్ ఇవ్వాలని.. ఇలా కొన్ని షరతులు పేర్కొనగా బోర్డు మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీంతో అమీర్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఇకపోతే అమీర్ ఫిక్సింగ్ కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, August 30, 2022, 18:06 [IST]
Other articles published on Aug 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+