
ఏం జరుగుతుంది:
షోయబ్ అక్తర్ యూ ట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'మహ్మద్ ఆమిర్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో హసన్ అలీ, వహాబ్ రియాజ్, జునైద్ ఖాన్ వంటి వారు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. పాకిస్తాన్ జట్టులో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. 27 ఏళ్లకే ఆమిర్ రిటైర్మెంట్ చెబితే అది మిగతా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది' అని అన్నారు.

పాక్ పరిస్థితి ఏంటి:
'ఆమిర్.. నీకు ఇంకా చాలా భవిష్యత్ ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్ నుంచి వైదొలగండం సరైంది కాదు. ఇప్పటికే పాకిస్తాన్ టెస్టు క్రికెట్ ప్రమాదంలో ఉంది. ఈ సమయంలో దేశానికి ఇచ్చేది ఇదేనా. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున‍్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్ చాలా చేసింది. ఎన్నో చాన్స్‌లు ఇచ్చి జట్టులోకి తెచ్చింది. అయినా కూడా ఫామ్‌లో ఉన్న సమయంలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటావా. నీలాగే మిగతా క్రికెటర్లకు కూడా ఆలోచిస్తే పాక్ పరిస్థితి ఏమవుతుంది' అని అక్తర్ ప్రశ్నించారు.

పాకిస్తాన్ క్రికెట్‌ను ఇమ్రాన్ ఖానే కాపాడాలి:
'మేము మీలాగే క్రికెట్ ఆడాం. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల్లో పాకిస్తాన్ సిరీస్‌లు గెలిచిన సమయంలో నేను గాయంతోనే బరిలోకి దిగా. ఆటపై శ్రద్ద ఉండాలి కానీ.. ఇలా చేయడం దారుణం. దీనిపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి. సెలక్షన్ కమిటీలో నేను ఉంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్‌లో ఎంపిక కాకుండా చేసేవాడిని. పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖానే గాడిలో పెట్టాలి. పాక్ క్రికెట్‌లో పూర్వ వైభవం రావాలంటే కఠిన చర్యలకు తీసుకోవాలి' అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

సరైన నిర్ణయం కాదు:
'ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. 28 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో గొప్ప ఫార్మాట్ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం సరైన నిర్ణయం కాదు. అతడు తొందర పడ్డాడు. పాకిస్తాన్ జట్టుకు ఆమిర్ అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు జట్టులో అతను ఉండటం ముఖ్యం' అని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications












