For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కన్నా రోహిత్ వికెట్ తీయడాన్నే బాగా ఆస్వాదిస్తా: పాక్ స్టార్ పేసర్

Mohammad Amir names Indian batsman he is always keen to dismiss, Not Virat Kohli

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్‌ తీయడాన్ని బాగా ఆస్వాదిస్తానని పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ తెలిపాడు. అమీర్ క్రికెట్ మైదానంలో భారత ఆటగాళ్లతో కొన్ని అద్భుత పోరాటాలు చేశాడు. ఒక్కోసారి పైచేయి సాధించాడు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ లేకపోవడం వల్ల అమీర్.. మెన్ ఇన్ బ్లూకు వ్యతిరేకంగా తన నైపుణ్యాలను ప్రదర్శించలేకపోతున్నాడు. అయితే ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి స్టార్ బ్యాట్స్‌మన్‌లను కూడా బోల్తా కొట్టించిన సందర్భాలు ఉన్నాయి.

రోహిత్ వికెట్ తీయడాన్నే ఆస్వాదిస్తా:

రోహిత్ వికెట్ తీయడాన్నే ఆస్వాదిస్తా:

లాక్‌డౌన్ నేపథ్యంలో పాకిస్థాన్ జర్నలిస్ట్‌ సాజ్ సాధిక్ తాజాగా మహ్మద్ అమీర్‌కి ఓ ప్రశ్న సంధించాడు. అమీర్.. ఏ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతావు? అడగ్గా.. 'చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎక్కువ ఆసక్తి చూపే బ్యాట్స్‌మెన్ మాత్రం రోహిత్ శర్మ' అని సమాధానమిచ్చాడు. అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీని ఎంచుకుంటాడు అని అందరూ అనుకోగా.. లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ మాత్రం రోహిత్ శర్మను ఎంచుకుని షాక్ ఇచ్చాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో చితకొట్టిన రోహిత్:

2019 వన్డే ప్రపంచకప్‌లో చితకొట్టిన రోహిత్:

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అందుకు కారణం 28 ఏళ్ల అమీర్. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వికెట్లను ఆరంభంలోనే పడగొట్టిన అమీర్.. ఆదిలోనే మ్యాచ్‌ని పాక్‌వైపు తిప్పేశాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం అమీర్ పప్పులు ఉడకలేదు. ‌అమీర్‌కి రోహిత్ చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 113 బంతుల్లోనే (14x4, 3x6) 140 పరుగులు చేసాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా 77 పరుగుల వద్ద అమీర్ బౌలింగ్‌లోఔటయ్యాడు. ఇక్కడ రోహిత్ మాత్రం అమీర్‌ని లక్ష్యంగా చేసుకుని ఓ ఆటాడుకున్నాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో మాటల యుద్ధం:

ఛాంపియన్స్‌ ట్రోఫీలో మాటల యుద్ధం:

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కి ముందు రోహిత్ శర్మ, మహ్మద్ అమీర్ మధ్య మాటల యుద్ధం నడించింది. అమీర్ ఓ సాధారణ బౌలర్ అని రోహిత్ శర్మ ఎద్దేవా చేయగా.. రోహిత్ శర్మ ఓ అసాధారణ బ్యాట్స్‌మెన్ అని అమీర్ అభివర్ణించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. అమీర్ గత ఏడాది టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ మంచి ఊపులో ఉండగానే టెస్టులకి వీడ్కోలు పలకడంపై పాక్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం:

17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన అమీర్.. 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. అమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మినహాయింపు ఇవ్వడంతో పాటు తిరిగి జాతీయ జట్టులో చోటు కల్పించింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత తన భార్య వీసాతో అమీర్ లండన్‌లో సెటిల్ అవనున్నట్లు వార్తలు వచ్చాయి. తన భర్తపై వచ్చిన వార్తలపై ఆమీర్ భార్య నర్గీల్ మాలిక్ కొట్టిపారేశారు.

Story first published: Tuesday, May 26, 2020, 13:47 [IST]
Other articles published on May 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+