న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌తో మూడు టీ20ల సిరిస్: ఆమిర్‌కు సెలక్టర్లు మొండిచేయి

Mohammad Amir ignored in Pakistan squad for T20Is against New Zealand​

కరాచీ: పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ ఆమిర్కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. యూఏఈ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో ఆమిర్‌కు చోటు దక్కలేదు. 2016 స్పాట్‌ ఫిక్సింగ్‌ నిషేధం ముగిసిన తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న ఆమిర్ కీలక బౌలర్‌గా మారాడు.

<strong>సానియా.. షోయబ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సెలబ్రిటీలు</strong>సానియా.. షోయబ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సెలబ్రిటీలు

అయితే, ఈ మధ్య కాలంలో ఆమిర్ ఆశించిన మేరకు రాణించడం లేదు. దీంతో ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌ కూడా ఆమిర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు దక్కుతుందని భావించినా... ఈసారి కూడా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపించారు.

మరోవైపు గత నెలలో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన సిరీస్‌లో పాకిస్తాన్-ఏ తరపున ఆడిన వకాస్‌ మజ్జూద్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసీస్‌తో సిరీస్‌కు మజ్జూద్‌ను ఎంపిక చేసినప్పటికీ అతనికి ఆడే అవకాశం లభించలేదు. పాక్‌తో ఇటీవల ముగిసిన సిరిస్‌లో ఆస్ట్రేలియాతో విజయం లేకుండా స్వదేశానికి తిరుగు పయనమైంది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 0-1తో చేజార్చుకున్న ఆస్ట్రేలియా... మూడు టీ20ల సిరిస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక, న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 31న
అబుదాబి వేదికగా జరగనుంది. మిగతా రెండు టీ20లు నవంబర్ 2, 4 తేదీల్లో జరగనున్నాయి.

పాకిస్థాన్ జట్టు:
Fakhar Zaman, Muhammad Hafeez, Sahibzada Farhan, Babar Azam, Shoaib Malik, Asif Ali, Hussain Tallat, Sarfraz Ahmed (Captain), Shadab Khan, Shaheen Shah Afridi, Usman Khan Shanwari, Hassan Ali, Imad Wasim, Waqas Maqsood and Faheem Ashraf

Story first published: Tuesday, October 30, 2018, 18:16 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X