Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీప్ సెలెక్షన్ ఇది.. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టుపై మాజీ పేసర్ అమీర్ కామెంట్

 Mohammad Amir Controversy Comments about Pakistan Team Selection for T20 World cup 2022

పీసీబీ సెలక్షన్ కమిటీ టీ20 ప్రపంచకప్ - 2022 కోసం పాక్ జట్టును నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సెలెక్షన్ అనంతరం పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ముహమ్మద్ వసీమ్‌ను దూషించాడు. వసీం ఎంపిక చేసిన 15మంది సభ్యుల జట్టు పట్ల తాను సంతోషంగా లేనని అమీర్ పేర్కొన్నాడు. వసీమ్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా‌కప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టులోని చాలా మంది ప్లేయర్లు జట్టుకు ఎంపికయ్యారు. పైగా పెద్దగా ఆశ్చర్యకరమైన అంశాలు ఏమీ కన్పించలేవు. నం.3లో బ్యాటింగ్ చేసిన ఫాఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా రిజర్వ్ గ్రూప్‌లో చేర్చబడ్డాడు, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్‌లు ఆసియాకప్‌కు గాయాలతో దూరం కాగా తిరిగి టీ20 ప్రపంచ‌కప్ జట్టుకు ఎంపికయ్యారు.మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆల్-రౌండర్ షోయబ్ మాలిక్‌లను సెలెక్షన్ కమిటీ మరోసారి పక్కనపెట్టేసింది. వారు తిరిగి జట్టులో పునరాగమనం చేసే వీలు లేదని సెలెక్షన్ కమిటీ చెప్పకనే చెప్పేసింది.

ఇక అమీర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. 'చీఫ్ సెలెక్టర్ కి చీప్ సెలక్షన్' అని కామెంట్ చేశాడు. జట్టు ఎంపికపై విమర్శలు గుప్పించిన పాకిస్థాన్ జర్నలిస్ట్ పోస్ట్‌ను కూడా అమీర్ పంచుకున్నాడు, ఆసియా కప్ 2022 ఫైనల్ ఓటమి తర్వాత జట్టు మిడిల్ ఆర్డర్ గురించి అనేకమంది ప్రశ్నలు గుప్పించినప్పటికీ.. మిడిలార్డర్లో పెద్దగా మార్పులు లేకుండానే జట్టు సెలెక్షన్ సాగింది. ఖుష్‌దిల్ షా, ఆసిఫ్ అలీ వంటి వారు ఆసియా కప్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ వాళ్లకు చోటు దక్కింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌ను పెంచుకోవడానికి పాకిస్తాన్ షాన్ మసూద్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది.
T20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ జట్టు :

బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, మసూద్, ఉస్మాన్ ఖదీర్.
రిజర్వ్ ప్లేయరలు : ఫాఖర్ జమాన్, మొహమ్మద్ హరీస్, షానవాజ్ దహానీ.

Story first published: Friday, September 16, 2022, 8:09 [IST]
Other articles published on Sep 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+