Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌: ఆసీస్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఆమీర్ రికార్డు

ICC Cricket World Cup 2019 : Mohammad Amir 1st Pak Bowler To Pick Up 5-Wickets vs Australia
Mohammad Amir 1st Pakistan bowler to pick up 5-wicket haul vs Australia in World Cup history

హైదరాబాద్: టాంటన్ వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఆమీర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమీర్ (5/30) కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫలితంగా పాకిస్థాన్ మాజీ బౌలర్లు వసీం అక్రమ్, షాహిద్ అఫ్రిది, సక్లయిన్ ముస్తాక్, అబ్ధుల్ ఖాదిర్, వాహబ్ రియాజ్, సోహైల్ ఖాన్ సరసన ఆమీర్ నిలిచాడు. అయితే, ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా మహ్మద్ ఆమీర్ చరిత్ర సృష్టించాడు. ఆమీర్ అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను 307 పరుగులకే కట్టడి చేశాడు.

అనంతరం ఆసీస్‌ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 45.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహ్మద్ హఫీజ్‌(46), కెప్టెన్ సర్ఫరాజ్‌(40)లు ఫరవాలేదనిపించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌ మూడు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్‌, రిచర్డ్‌సన్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన డేవిడ్‌ వార్నర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్

ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఫకార్ జమాన్‌ పరుగులేమి చేయకుండానే కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్‌ మరో ఓపెనర్‌ ఇమాముల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

136 పరుగులకు రెండు వికెట్లు

136 పరుగులకు రెండు వికెట్లు

దూకుడుగా ఆడే క్రమంలో బాబర్‌ ఆజామ్ (30)ను నైల్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హఫీజ్‌తో కలిసి ఇమాముల్‌ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడు. దీంతో రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి పట్టిష్ట స్థితిలో ఉంది. దీంతో విజయం పాకిస్థాన్‌దే అని అనుకున్నారంతా.

స్వల్ప వ్యవధిలో ముగ్గురు ఔట్

ఈ సమయంలో ఇమాముల్‌(53), హఫీజ్‌(46), మాలిక్‌(0), అసిఫ్‌ అలీ(5)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో పాకిస్థాన్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సర్ఫరాజ్‌తో కలిసి బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ విజయం కోసం పోరాడాడు. బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పెంచే ప్రయత్నం చేశారు.

ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు

వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం వాహబ్‌(45)ను స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమిర్‌(0)ను స్టార్క్‌ ఔట్ చేశాడు. ఇక, మ్యాక్స్‌వెల్‌ సూపర్‌ త్రోతో సర్పరాజ్‌ను రనౌట్‌ చేయడంతో ఆసీస్‌ విజయం సాధించింది.

307 పరుగులకు ఆలౌటైన ఆసీస్

307 పరుగులకు ఆలౌటైన ఆసీస్

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ ఆటగాళ్లలో వార్నర్‌(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీ సాధించగా.. ఆరోన్ ఫించ్‌(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. పాక్‌ బౌలర్లలో అమిర్‌(5/30), షాహిన్‌ ఆఫ్రిది(2/70)లు రాణించారు.

Story first published: Thursday, June 13, 2019, 12:38 [IST]
Other articles published on Jun 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+