For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు తరాలు, రెండు దేశాలు.. కానీ ఒకే కల.. అరంగేట్రంలోనే రికార్డు!

NZ vs PAK: 90వ దశకంలో పాకిస్థాన్ దేశీయ క్రికెట్‌లో ఒక పేరు చాలా వార్తల్లో ఉండేది. ఆ పేరు అజార్ అబ్బాస్. ఆయన పాకిస్థాన్ తరఫున దేశీయ క్రికెట్‌లో క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న సమయంలో తన కుటుంబంతో సహా న్యూజిలాండ్‌కు మారాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌లో కూడా ఆయన దేశీయ క్రికెట్ ఆడాడు, కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు.

ఇప్పుడు ఆయన కుమారుడు పాకిస్థాన్‌తో జరిగిన న్యూజిలాండ్ జట్టు తరపున తన వన్డే అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మహమ్మద్ అబ్బాస్ పేరు చర్చనీయాంశమవుతోంది. మహ్మద్ అబ్బాస్ 2003 నవంబర్ 29న పాకిస్థాన్‌లో పంజాబ్‌లోని లాహోర్ నగరంలో జన్మించాడు. ఆయన తండ్రితో పాటు పాకిస్థాన్ నుంచి న్యూజిలాండ్‌కు మకాం మార్చాడు. 16 సంవత్సరాల వయస్సులో న్యూజిలాండ్ క్రికెట్ తన టాలెంట్ పాత్ వే కార్యక్రమంలో మహ్మద్ అబ్బాస్‌ను చేర్చుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వెల్లింగ్టన్ క్రికెట్ అబ్బాస్ కు దేశీయ కాంట్రాక్టును ఇచ్చింది. అతని తండ్రి అతనితో కలిసి వెళ్లి వెల్లింగ్టన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉద్యోగంలో చేరాడు.

Mohammad Abbas Creates History with Half-Century in ODI Debut Against Pakistan

నెరవేరని అజాస్ అబ్బాస్ కల..
న్యూజిలాండ్ తరఫున అజార్ అబ్బాస్ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించలేకపోయాడు. కానీ ఆయన కొడుకు ఇప్పుడు తన కలను నెరవేర్చుతున్నాడు. మహ్మద్ అబ్బాస్ ప్రస్తుత వయస్సు కేవలం 21 సంవత్సరాల 120 రోజులు. మహ్మద్ అబ్బాస్ కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తాడు. ఎడమ చేతితో మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. మహ్మద్ అబ్బాస్ దేశవాళీ క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. అతను ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్‌లో 21 మ్యాచ్ లు, లిస్ట్ ఏలో 15 మ్యాచ్‌లు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

పాక్‌తో మ్యాచ్‌లో చెలరేగిన మహ్మద్ అబ్బాస్
న్యూజిలాండ్ తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మహ్మద్ అబ్బాస్ కేవలం 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మహ్మద్ అబ్బాస్ 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. ఇది మహ్మద్ అబ్బాస్ తొలి వన్డే మ్యాచ్. తొలి మ్యాచ్ లోనే తన రికార్డు స్థాయి అరంగేట్ర హాఫ్ సెంచరీతో ఆతిథ్య జట్టు 344 పరుగుల భారీ స్కోరును నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Saturday, March 29, 2025, 18:35 [IST]
Other articles published on Mar 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+