INDvsBAN: నిప్పులు చెరిగిన హైదరాబాదీ పేసర్.. బంగ్లా విలవిల!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ విలవిల్లాడుతోంది. టెయిలెండర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన భాగస్వామ్యంతో భారత జట్టు 404 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించారు.

సూపర్ సిరాజ్
భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. భారత్‌కు పోటీ ఇవ్వాలంటే బలమైన ఓపెనింగ్ అవసరమని నమ్మిన బంగ్లా.. ఆ దిశగా అడుగులు వేయాలని అనుకుంది. కానీ సిరాజ్ వేరే ప్లాన్ వేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటో (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపాడు. ఆఫ్ స్టంప్‌కు ఆశలగా పడిన గుడ్ లెంగ్త్ బంతిని ఆడేందుకు షాంటో ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి కీపర్ వైపు వెళ్లింది. రిషభ్ పంత్ ఎలాంటి సమస్య లేకుండా క్యాచ్ పట్టేయడంతో బంగ్లాకు తొలి షాక్ తగిలింది.

లిటాన్ దాస్ షాక్
షాంటో వికెట్ తీసిన తర్వాత కాసేపటికి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన లిటాన్ దాస్‌తో సిరాజ్‌కు వాగ్వాదం జరిగింది. సిరాజ్ వేసిన బంతిని పాయింట్ దిశగా దాస్ ఆడాడు. అది చూసిన సిరాజ్ ఏదో అన్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న దాస్.. 'ఏదీ మళ్లీ ఆ మాట అను' అంటూ ముందుకెళ్లాడు. ఇది చూసిన అంపైర్ వెంటనే కలుగజేసుకొని ఇద్దరినీ ఆపాడు. అయితే ఆ తర్వాత దాస్‌కు వేసిన తొలి బంతికే అతన్ని అవుట్ చేసిన సిరాజ్ చివరకు తనదే పైచేయి అని నిరూపించాడు. సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

సిరాజ్ ఖాతాలో మరో వికెట్
అక్కడితో సిరాజ్ పని పూర్తవలేదు. ఆ తర్వాత 18వ ఓవర్లో బంగ్లా రెండో ఓపెనర్ జాకిర్ హసన్ (20)ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన బంతిని ఆడేందుకు జాకిర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో కీపర్ రిషభ్ పంత్‌కు సులభమైన క్యాచ్ వచ్చింది. దాన్ని అతను అందుకోవడంతో జాకిర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. సిరాజ్‌తోపాటు ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో బంగ్లా జట్టు 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications