పంత్ స్టంపౌట్ మిస్ చేసిన వేళ: కోహ్లీతో ధోనిని పిలువ్ అన్న ఫ్యాన్ (వీడియో)


హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా గత ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొత్తం ధోనీ పేరుతో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
ప్రత్యేకంగా వికెట్ల వెనుక రిషబ్ పంత్ వైఫల్యాన్ని ఉద్ధేశిస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ధోని స్థానంలో కీపింగ్ చేసిన రిషబ్‌పంత్ రెండు మూడు సార్లు స్టంపౌట్లను జారవిడిచాడు. రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందంటూ మ్యాచ్ అనంతరం విమర్శలు వెల్లువెత్తాయి.
Mohali Crowd today #INDvsAUS pic.twitter.com/MBDWcbr8Ht
— POWERSTAR (@Teja_PSPK99) March 10, 2019
పంత్ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలో
ఈ మ్యాచ్‌లో వికెట్ల వెనుక పంత్ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలోని అభిమానులు ధోనీ.. ధోనీ అంటూ అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెప్టెన్ కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని గట్టిగా అరుస్తూ.. ‘విరాట్ భాయ్ ధోనీ కో బులావో' అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

44వ ఓవర్లో చాహల్ బౌలింగ్ చేస్తుండగా
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 44వ ఓవర్లో చాహల్ బౌలింగ్ చేస్తుండగా టర్నర్ క్రీజు నుంచి కాస్త ముందుకు వెళ్లాడు. బంతి వైడ్‌గా వెళ్లడంతో పంత్ దాన్ని అందుకోలేకపోయాడు. టర్నర్‌ను ఔట్ చేసే మంచి అవకాశం చేజారింది. అప్పటికి అతడు 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశం తర్వాత టర్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ధోనీని కాపీ కొట్టబోయిన పంత్
ఆ తర్వాత మరో 16 బంతుల్లో 46 పరుగులు చేసి 13 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియాకు విజయాన్నందించాడు. అలాగే మరోసారి కారేను స్టంపింగ్ చేసే అవకాశాన్ని సైతం పంత్ చేజార్చాడు. ధోనీ మాదిరి వికెట్లని చూడకుండా బంతిని విసరడం ద్వారా స్టంపౌట్ మిస్సైంది. దీంతో స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ అంటూ కేకలు వేశారు.

ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం
నాలుగో వన్డేలో ఓటమితో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 84 నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ ఆటగాడు టర్నర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications