UAE ILT20 : షార్జా వారియర్స్ జట్టు ఇదే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి మొయిన్ అలీ దెబ్బ..?

UAEలో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ T20 (ఐఎల్ టీ20) ప్రారంభ ఎడిషన్ కోసం షార్జా వారియర్స్ తన స్క్వాడ్ ప్రకటించింది. 14 మంది అంతర్జాతీయ ప్లేయర్లు షార్జా వారియర్స్ తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఇక వీరిలో మోయిన్ అలీ, డేవిడ్ మలన్, ఎవిన్ లూయిస్, మహ్మద్ నబీ మరియు క్రిస్ వోక్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఐసీసీ ప్రకటించిన కొత్త ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకారం.. 2023 జనవరి చివరిలో, ఫిబ్రవరి ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అందువల్ల అదే సమయంలో జరగబోయే యూఏఈ లీగ్ కొన్ని మ్యాచ్‌లకు మొయిన్ అలీ మిస్సయ్యే వీలుంది. పైగా దాదాపు ఇంచుమించు అదే టైంలో జరగబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోహన్నెస్ సూపర్ కింగ్స్ తరఫున ఆడడానికి సంతకం చేసిన మొయిన్ అలీ.. ఇప్పుడు షార్జా వారియర్స్‌కు సంతకం చేయడంతో అతను సౌతాఫ్రికా లీగ్‌కు ఆడడం డౌటే. తమ జట్టు స్టార్ ప్లేయర్ అని ప్రకటించుకున్న చెన్నై ఫ్రాంచైజీకి దెబ్బ పడేలా ఉంది.

మొయిన్ అలీ ఏం డిసైడ్ అవుతాడో..?
ఇక ఒకే టైంలో అన్ని షెడ్యూళ్లు ఉండడంతో మొయిన్ అలీ ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాడా, లేక యూఏఈ లీగ్‌కా, లేక సౌతాఫ్రికా టీ20 లీగ్‌కా అనేది గందరగోళంగా ఉంది. ఇక ఆ టైంలో మొయిన్ అలీపై లీగ్‌ల నుంచి ప్రెషర్ ఉంటే.. జాతీయ జట్టుకు ఆడే అవకాశం తగ్గిపోవచ్చు. లేక సర్దు బాటు చేసుకుని రెండు లీగ్‌లలో ప్రధాన మ్యాచ్‌లు ఆడే వీలుంది. ఏదేమైనా జనవరి, ఫిబ్రవరిలో ఆటగాళ్ల షెడ్యూల్ యమ బిజిబిజీగా ఉండనుంది. ఇకపోతే షార్జా ఫ్రాంచైజీని కాప్రి గ్లోబల్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఈ సంస్థ స్థానిక యూఏఈ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని చూస్తుంది. ఈ సంస్థ ఐపీఎల్‌కు సంబంధించింది కాదు.

ఇప్పటికే జట్లను ప్రకటించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇకపోతే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అయిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ ఎమిరేట్స్, నైట్ రైడర్స్ గ్రూప్ యాజమాన్యంలోని అబుదాబి నైట్ రైడర్స్, అదానీ స్పోర్ట్స్‌లైన్ యాజమాన్యంలోని గల్ఫ్ జెయింట్స్, GMR యాజమాన్యంలోని దుబాయ్ క్యాపిటల్స్ ఇప్పటికే ఐఎల్ టీ20లో తమ జట్లను కొనేసుకుని తమ స్క్వాడ్‌లను కూడా ప్రకటించేశాయి.

క్రేజ్ పరంగా ఐఎల్‌టీ20 లీగ్ కాస్త బెటర్
ఐఎల్‌టీ 20 ప్రారంభ ఎడిషన్ జనవరి 2023 నుండి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా జరగనుంది. మొత్తం ఈ లీగ్‌లో 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదే సమయంలో ఐఎల్ టీ20 లీగ్ దక్షిణాఫ్రికా టీ20లీగ్‌కు పోటాపోటీ ఇవ్వబోతుంది. ఈ రెండు లీగ్‌లకు మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్లేయింగ్ 11 జట్టులో కేవలం నలుగురు మాత్రమే విదేశీ ప్లేయర్లు ఆడాలనే నిబంధన ఉంది. కానీ ఐఎల్‌టీ 20లో మాత్రం ప్లేయింగ్ 11లో తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లు ఆడడానికి అనుమతి ఉంది. దీంతో క్రేజ్ పరంగా ఐఎల్‌టీ 20 లీగ్ కాస్త బెటర్ వ్యూయర్ షిప్ దక్కించుకునే అవకాశాలున్నాయి.

షార్జా వారియర్స్ స్క్వాడ్ :
మొయిన్ అలీ (ఇంగ్లాండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లండ్), క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), డానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), బిలాల్ ఖాన్ (ఒమన్) మరియు జెజె స్మిత్ (నమీబియా).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications