ఇంగ్లండ్ స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. యువకులకు అవకాశం ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొంటూ వీడ్కోలు పలికాడు. డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్ కొనసాగిస్తానని తెలిపాడు. భవిష్యత్‌లో కోచ్‌గా పనిచేస్తానని పేర్కొన్నాడు.
''ఇంగ్లండ్‌కు ఎంతో కాలం క్రికెట్ ఆడాను. ఇక వచ్చే తరానికి అవకాశమిచ్చే సమయం ఇది. ఈ నిర్ణయానికి ఇదై సరైన సమయంగా భావిస్తున్నా. నా పాత్ర పూర్తిచేశాను'' అని 37 ఏళ్ల అలీ పేర్కొన్నాడు.
2014లో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన మొయిన్ అలీ 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,678 పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక బౌలింగ్‌లో 366 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడిన సెమీఫైనలే అలీ చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్. ''నేను ఎంతో గర్వపడుతున్నా. ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఎన్ని మ్యాచ్‌లు ఆడగలనో నాకు తెలియలేదు.సుమారు 300 మ్యాచ్‌లు ఆడాను. కెరీర్ ఆరంభంలో కొన్నాళ్లు టెస్టు క్రికెట్ ఎక్కువగా ఆడాను. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ తర్వాత వన్డేలు ఎక్కువగా ఆడాను''
''మరికొంతకాలం ఆటను కొనసాగించవచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలంటే నేను ఆడలేను. జట్టులో మరో తరం రావాల్సి ఉంది. మ్యాచ్‌లో మనం ప్రభావితం చేసే కొన్ని పరుగులను ప్రజలు మరిచిపోతారు. అది 20 లేదా 30 పరుగులు కావొచ్చు. కానీ ఆ పరుగులు ఎంతో కీలకం. నా పరంగా ఇంపాక్ట్ ఇన్నింగ్స్ చాలా ముఖ్యం. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ కొనసాగించాలనుకుంటున్నాను. కోచింగ్‌పై ఆసక్తి ఉంది'' అని మొయిన్ అలీ పేర్కొన్నాడు.
ఫ్రాంచైజీ క్రికెట్‌లో అలీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, సీపీఎల్‌లో గయానా అమెజాన్ వారియర్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చిట్టగాంగ్ వికింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.