For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20‌లకు ఇంగ్లాండ్ కెప్టెన్‌గా మొయిన్ అలీ.. వైదొలిగిన జాస్ బట్లర్

Moeen Ali Going to Lead the England T20 Squad For Pakistan Tour

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన జోస్ బట్లర్ స్థానంలో ఆ జట్టు స్టార్ ఆల్-రౌండర్ అయిన మొయిన్ అలీని టీ20లకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ప్రకటించింది. ఇకపోతే ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 17ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఇంగ్లాండ్ టీం వచ్చే నెల వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో మొయిన్ అలీ ఇంగ్లాండ్‌కు కెప్టెన్సీ వహించనున్నాడు.

జాస్ బట్లర్ క్యాఫ్ స్ట్రెయిన్‌ గాయంతో బాధపడుతూ సెలెక్షన్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో మొయిన్ అలీని కెప్టెన్‌గా ఆ దేశ బోర్డు నియమించింది. ఇకపోతే గాయం కారణంగా ఇటీవల హండ్రెడ్ లీగ్ నుంచి కూడా బట్లర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనికి నాలుగు వారాల విరామం అవసరం కావడంతో ఇక పాకిస్థాన్ టీ20సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇకపోతే హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 203పరుగులు చేశాడు. అతను సదరన్ బ్రేవ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.

ఇకపోతే 2005 తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లాండ్ వెళ్లనుంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2వరకు ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో ఇంగ్లాండ్ ఆడనుంది. మొదటి ఆరు టీ20లు కరాచీలో జరుగుతాయి. ఏడవది లాహోర్‌లో జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ స్వదేశానికి బయలుదేరుతుంది. ఇకపోతే డిసెంబర్‌లో పాకిస్థాన్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ మళ్లీ పాక్ రానుంది.

డిసెంబరు 1 నుంచి 21మధ్య మూడు టెస్టులు జరుగుతాయి. రావల్పిండిలో తొలి టెస్ట్, ముల్తాన్‌లో 2వ టెస్టు, కరాచీలో 3వ టెస్టు జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతుంది. చివరిసారిగా ఇంగ్లాండ్ పాకిస్థాన్‌లో 2005లో పర్యటించగా.. మైకేల్ వాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ టీం మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-2తో కోల్పోయింది.

Story first published: Wednesday, August 31, 2022, 16:02 [IST]
Other articles published on Aug 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+