
ఇంగ్లాండ్ రెడ్ బాల్ టీమ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో ఓ హానెస్టీ సంభాషణ జరిపిన అనంతరం.. మొయిన్ అలీ తన టెస్ట్ పునరాగమనంపై ఓ స్పష్టతనిచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు తిరిగి మళ్లీ రావడానికి తాను దారులు అన్నీ మూసేసుకున్నట్లు వెల్లడించాడు. అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ 2021లో ఆడాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం.. గతేడాది సెప్టెంబర్‌లో అతను టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే తాజాగా మొయిన్ అలీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడని.. మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి వస్తాడని ఇటీవల పుకార్లు ఊపందుకున్నాయి. కానీ ఆ పుకార్లన్నింటీని మొయిన్ అలీ కొట్టిపారేశాడు.
డైలీ మెయిల్ అనే ప్రముఖ వార్తాపత్రికలో ఈ విషయాన్ని తెలియజేశాడు. మెకల్లమ్‌తో ఇటీవల తాను హానెస్టీగా చాట్ చేశానని.. ఇక మీదట టెస్ట్ క్రికెట్ ఆడేందుకు తాను సంసిద్ధంగా లేనట్లు మెక్కల్లమ్‌తో తెలిపినట్లు అలీ ఆ పత్రిక కాలమ్‌లో పేర్కొన్నాడు. మెక్కల్లమ్ ఫోన్ చేశాడని, చాలాసేపు ఇద్దరం మాట్లాడుకున్నామని అలీ చెప్పాడు. మెకల్లమ్ తన నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపాడు. ప్రస్తుతం పరిమిత ఫార్మాట్లో క్రికెట్‌ను టైంను ఆస్వాదించాలనుకుంటున్నానని, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సరైంది కాదని చెప్పాడు. ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ క్రికెట్లో ఆడటం తన జీవితంలో అతి పెద్ద విశేషమని చెప్పాడు.
'నేను మెకల్లమ్‌తో మాట్లాడా. నేను నెలల తరబడి హోటళ్లలో ఇరుక్కుపోయి టెస్టులు ఆడే ఓపిక లేదని చెప్పాను. మెక్కల్లమ్ ఫోన్ చేస్తే చాలా విషయాలపై మాట్లాడాను. అతను టెస్ట్ క్రికెట్లోకి తిరిగి రావొచ్చు కదా అని అభ్యర్థించాడు. కానీ నేను ఒకటే చెప్పాను. క్షమించండి.. నేను టెస్టు కెరీర్ ముగించాను. ఇక ఎంత మాత్రం ఆడాలనుకోవట్లేదు. అతను అర్థం చేసుకున్నాడు, అతనికి నా ఫీలింగ్ ఏంటో తెలుసు. టెస్ట్ క్రికెట్ చాలా కష్టంతో కూడుకున్నది. నా వయస్సు ఇప్పటికే 35 దాటింది. ఈ టైంలో సుదీర్ఘ ఫార్మాట్లో ఆడడం, నా నుంచి జట్టుకు ఏదైనా అందివ్వడం కాస్త కఠినమైందే. అందువల్లే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ టెస్టుల్లో అడుగుపెట్టలేను. నా నిర్ణయం బట్టి నా టెస్ట్ కెరీర్‌కు తలుపులు మూసుకున్నాయని భావించండి. ఇంగ్లాండ్ తరఫున 64టెస్టులు ఆడడం నిజంగా చాలా గొప్ప విశేషం. ఆ విషయంలో నా డ్రీమ్ నెరవేరింది. ఇక చాలు అని మెక్కల్లమ్‌తో చెప్పాను.' అని మొయిన్ పేర్కొన్నాడు.