Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Moeen Ali: క్రికెట్లో ఆ చట్టాన్ని తొలగించాలి.. ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే చూడాలి

Moeen Ali About The Recent Issue Of Deepti Sharmas controversy Runout

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో రనౌట్ చేసే విషయమై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇంగ్లాండ్‌లో భారత్ ఇటీవల 3-0తేడాతో వన్డే సిరీస్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ చివరి వికెట్ కాంట్రవర్సీగా మారింది. దీప్తి శర్మ.. చార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ చేసింది. దీన్ని మన్కడింగ్‌గా పిలుస్తుంటారు. ఇక ఈ రనౌట్ విషయం పెద్ద దుమారమైన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్ మెన్స్ టీం స్టాండ్ ఇన్ కెప్టెన్ మోయిన్ అలీ ఈ విషయమై మాట్లాడుతూ.. మన్కడింగ్ ఔట్ పూర్తిగా క్రికెట్ చట్టాల నుంచి తీసేసి చట్ట విరుద్ధమని ప్రకటించాలన్నాడు. నాన్ స్ట్రైకర్ బ్యాటర్లు క్రీజు ముందుగానే వీడకుండా ఇతర మార్గాలను సిఫార్సు చేయాలన్నాడు.

చిన్నప్పుడు గార్డెన్లో ఆడినప్పుడు కూడా ఇలా చేయలేదు

చిన్నప్పుడు గార్డెన్లో ఆడినప్పుడు కూడా ఇలా చేయలేదు

'ఇలా రనౌట్ నేనైతే చేయను. నేను ఏ ప్లేయర్ పట్లనైన పీకల దాకా కోపంగా ఉంటే తప్ప నేను ఇలాంటి రనౌట్ చేస్తానని అనుకోను. ఇది క్రికెట్ చట్టాలలో ఉంది. ప్రస్తుతం ఇది చట్టవిరుద్ధం ఏమీ కాదు. కాబట్టి ఇలా రనౌట్ చేయడానికి బౌలర్లకు హక్కు ఉంటుంది. కానీ ఇది అంత సాధారణ ఔట్ కాదు. ఎవరు కూడా దీన్ని రెగ్యులర్‌గా చేయరు. ఇతర అన్ని వికెట్లు ఎంతో కొంత బ్యాటర్ ఇన్వల్వ్‌మెంట్ జరుగుతాయి. కనీసం రనౌట్ అయినా సరే.. ఇరు బ్యాటర్ల ప్రమేయంతో జరుగుతుంది. కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్. నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే ఔట్ చేయడం ఎందుకో బాలేదు. నేను చిన్నప్పుడు గార్డెన్‌లో క్రికెట్ ఆడినప్పుడు కూడా ఇలా ఔట్ చేయలేదు.' అని మొయిన్ అలీ అన్నాడు.

వెనక్కి రావడం అంతా ఈజీ కాదు

వెనక్కి రావడం అంతా ఈజీ కాదు

'ఎలాగైనా క్రీజులో ఉండాలి. అది నాన్ స్ట్రైకర్ ధర్మం. బంతి బౌలర్ రిలీజ్ చేసే వరకు తప్పకుండా క్రీజులోనే ఉండాలి. అయితే అది కొన్నిసార్లు చాలా కష్టం. అన్ని సార్లు బౌలర్ల బంతి రిలీజ్ చేసే విషయాన్ని కనిపెట్టలేము. బౌలర్ నేరుగా బౌలింగ్ చేయబోతున్నాడని మీరు అనుకుంటారు. అందుకే ఫోర్స మూమెంట్‌తో ముందుకు కదులుతారు. అమాంతం అతను ఆగిపోయి బాల్ చేతిలో పట్టుకుని వికెట్లు గిరటేస్తే మీ మూమెంట్ దెబ్బతిని వెనక్కి రావడం అంతా ఈజీ కాదు.' అని అతను వెల్లడించాడు.

బోరున ఏడ్చిన ఛార్లీ డీన్

బోరున ఏడ్చిన ఛార్లీ డీన్

ఇక చివరి వన్డేలో ఛార్లీ డీన్ 47పరుగులతో ఛేజింగ్ టైంలో మంచి ప్రతిఘటన కనబర్చింది. ఒంటి చేత్తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చడానికి శాయశక్తుల ప్రయత్నించింది. ఆమె ఫ్రెయా డేవిస్‌తో కలిసి చివరి వికెట్‌కు 35పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించింది. ఇక 17పరుగులు అవసరం అయిన దశలో సడెన్‌గా మన్కడింగ్ విధానంలో ఆమె రనౌట్ కావడంతో షాక్‌కు గురైంది. దీప్తి శర్మ అనూహ్యంగా వికెట్లను గిరాటేయడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆమె తెల్లమొహం వేసింది. ఔట్ అని ప్రకటించడంతో బోరున ఏడ్చేసింది. ఆమెను డేవిస్ ఓదార్చింది. ఇక ఈ సిరీస్లో డీన్ 54సగటుతో 108పరుగులు చేసింది. మూడు వికెట్లు కూడా తీసుకుంది.

Story first published: Wednesday, September 28, 2022, 13:31 [IST]
Other articles published on Sep 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+