For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK Vs RR: తొలుత దుమ్ముదులిపారు, చివరికి దమ్ముకొచ్చారు.. రాజస్థాన్‌కు ఈజీ టార్గెట్ ఇచ్చిన చెన్నై

Moeen Ali (93) storming Half century helps to CSK Score 150

మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లో తన చిట్టచివరి మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ముంబైలోని సీసీఐ బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్లు కోల్పోయి 150పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్‌‌కు 151పరుగుల టార్గెట్ విధించింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93పరుగులు 57బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్ నుంచి అంతగా సపోర్ట్ లేకపోవడంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, మెక్ కాయ్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు.

ఆదిలోనే దెబ్బ తగిలినా..

ఆదిలోనే దెబ్బ తగిలినా..

బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆదిలోనే గట్టి దెబ్బ తగలింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ (2) క్యాచ్ అవుట్ అయ్యాడు. బోల్ట్ వేసిన 3ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టి డెవాన్ కాన్వే స్కోరు బోర్డు ముమెంటమ్ పెంచేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీ క్రీజులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4వ ఓవర్లో 3ఫోర్లు, 1సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లో 18పరుగులు వచ్చాయి. తర్వాత 5వ ఓవర్ అశ్విన్ వేయగా ఆ ఓవర్లోనూ 2ఫోర్లు, 1సిక్సర్‌తో చెలరేగి ఆడాడు. ఆ ఓవర్లోనూ 16పరుగులొచ్చాయి.

తన పవర్ ఏంటో చూపించిన మొయిన్ అలీ

తన పవర్ ఏంటో చూపించిన మొయిన్ అలీ

పవర్ ప్లే ముగిసే ఆరో ఓవర్లో మొయిన్ అలీ బౌల్ట్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన అలీ తర్వాత 5బంతులను 5ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో ఏకంగా మొయిన్ అలీ ఏకంగా 26పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 19బంతుల్లోనే మొయిన్ అలీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే (6ఓవర్లు) పూర్తయ్యేసరికి చెన్నై స్కోరు వికెట్ కోల్పోయి 75పరుగులు చేసింది. ఇక ఇదే జోరు కనబరిస్తే ఈజీగా చెన్నై స్కోరు 200దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ 8వ ఓవర్లో అశ్విన్ డెవాన్ కాన్వే(16పరుగులు 14బంతుల్లో)ను ఔట్ చేయడంతో స్కోరు బోర్డు వేగం మందగించింది. తద్వారా అలీ, కాన్వే 83పరుగుల భాగస్వామ్యానికి దెబ్బపడింది.

చివర్లో టెస్టు అనుకుని ఆడారు

చివర్లో టెస్టు అనుకుని ఆడారు

ఇక ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్లు భారీగా పుంజుకున్నారు. 9వ ఓవర్లో మెక్ కాయ్.. మిడిలార్డర్ బ్యాటర్ జగదీశన్ (1)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత చెన్నై పూర్తిగా గాడితప్పింది. 11ఓవర్లో చాహల్ అంబటి రాయుడు(3)ను పెవిలియన్ కు పంపాడు. తర్వాత క్రీజులో దిగిన ధోనీ తన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా మొయిన్ అలీని కూడా ఆడేలా చేశాడు. దీంతో స్కోరు వేగం పూర్తిగా నెమ్మదించింది. 12ఓవర్లకు 100పూర్తి చేసుకున్న చెన్నై ఈజీగా 170పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ధోనీ, అలీ టీ20 గేమ్ మర్చిపోయి నిదానంగా ఆడడంతో స్కోరు బోర్డుకు కళ్లెం పడింది. 19ఓవర్ వరకు సాదాసీదాగా సాగిన చెన్నై ఇన్నింగ్స్ ధోనీ (26పరుగులు 28బంతుల్లో) ఔటవ్వడం, ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి మొయిన్ అలీ క్యాచ్ ఔటవ్వడంతో చెన్నై 20ఓవర్లు ముగిసేసరికి కేవలం 6వికెట్లు కోల్పోయి 150పరుగులు మాత్రమే చేయగలిగింది. మొయిన్ అలీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

Story first published: Friday, May 20, 2022, 21:51 [IST]
Other articles published on May 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+