Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లలిత్ మోడీ అధికారాల కత్తిరింపు

Lalit Modi
ముంబై: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మద్దతు ఉన్నప్పటికీ ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీకి కష్టాలు తప్పడం లేదు. ఆయన అధికారాలను తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నడుం బిగించింది. మోడీ నుంచి బిసిసిఐ - ఐపియల్ పాలక మండలి అధికారాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు శుక్రవారం సమాచారం అందుతోంది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ తో తాజా వివాదంతో లలిత్ మోడీకి పగ్గాలు వేయాలని బిసిసిఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఐపియల్ కో - చైర్మన్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. లలిత్ మోడీ వ్యవహార శైలిని తప్పు పడుతూ శశాంక్ మనోహర్ ఇటీవల ఓ లేఖ రాశారు.

కాగా, లలిత్ మోడీతో వివాదంపై శశి థరూర్ గురువారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరణ ఇచ్చుకున్నారు. దీంతో థరూర్ కు తాత్కాలికంగా ఊరట లభించింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకు థరూర్ పై ఏ విధమైన చర్యలూ తీసుకోకూడదని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకుంది. ఈలోగా, ఐపియల్ ఆర్థిక లావాదేవీలపై ఆదాయం పన్ను శాఖ దృష్టి సారించింది. లలిత్ మోడీని సాధ్యమైనంత వరకు కట్టడి చేయడమే ఈ దాడుల వెనక ఉన్న వ్యూహమని అంటున్నారు. ఇదే సమయంలో కోచ్చి ఉన్నతస్థాయి యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోచ్చి యాజమాన్య బాధ్యతలను దుబాయ్ కి చెందిన భారత వాణిజ్యవేత్త హర్షద్ మెహతా తీసుకున్నారు. సిఇవోను, జట్టు అధికార ప్రతినిధిని మార్చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+