Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసిసికి పోటీ?: కొత్త రకం క్రికెట్ తెస్తానన్న మోడీ

లండన్: ఒలింపిక్స్‌కు అనుబంధంగా ఉండేలా, అన్ని ప్రపంచ దేశాలనూ భాగం చేస్తూ, సరికొత్త క్రికెట్ గవర్నింగ్ బాడీ త్వరలో రానుందని, దానికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధంగా ఉందదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోడీ అన్నాడు.

కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోడీ సోమవారం ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడాడు.

అక్రమంగా డబ్బు తరలింపు, టెలివిజన్ ప్రసారాల హక్కుల విషయంలో అక్రమాలు తదితర కేసులను ఎదుర్కొంటున్న ఆయన, మరో క్రికెటింగ్ సిస్టమ్ రానుందని ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. దీన్ని జనరంజకంగా తయారు చేసేందుకు సంవత్సరాల తరబడి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపాడు.

Modi reveals blueprint of breakaway cricket body to rival ICC

అప్పట్లో ఈ ప్రాజెక్టు నుంచి తనను బలవంతంగా గెంటేశారని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు దీన్ని తయారు చేశానని చెప్పాడు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మోడీ, ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ క్రికెట్ రంగాన్ని ఇతర దేశాలకు దగ్గర చేయాలన్నదే తన అభిమతమని అన్నాడు.

ఆ ప్రాజెక్టుపై తిరిగి మనసు పెట్టానని, ఇది కార్యరూపం దాల్చేందుకు వేల కోట్ల రూపాయల డబ్బు అవసరమని, నగదు సమీకరణ పెద్ద కష్టం కాదని అంటున్నాడు. ఐసిసికి పోటీగా ఉండే ఈ కొత్త క్రికెట్ వ్యవస్థలో వన్డే పోటీలుండవని, ట్వంటీ20లు, టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+