Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లలిత్ మోడియే బాధ్యుడు: పిసిబి

Lalit Modi
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) 3 వేలం పాటల్లో తమ దేశ ఆటగాళ్లను విస్మరించడానికి ఐపియల్, దాని కమిషన్ లలిత్ మోడీ కారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ ఎజాజ్ భట్ నిందించారు. దీని వల్ల ఇరు దేశాల క్రీడాసంబంధాలపై ఏ విధమైన ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఐపియల్ కు తమ దేశ ఆటగాళ్లను దూరం పెట్టాలనే నిర్ణయం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. ఐపియల్ కు తమ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోకపోవడం వారి చేసిన తప్పు అని ఆయన అన్నారు.

ఐపియల్ తమ దేశ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఐపియల్ ఎందుకు తమ ఆటగాళ్లను పక్కన పెట్టిందనే విషయం తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. వివాదం వెనక గల ఉద్దేశ్యమేమిటో మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశం ఏమిటనేది మీరు లలిత్ మోడీనే అడగాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భారత్ లో గానీ, పాకిస్తాన్ లో గానీ ఎవరికైనా అర్థమైందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+