Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోడల్‌ సూసైడ్.. చిక్కులో సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్

సన్‌రైజర్స్ యువ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూర‌త్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసులు అభిషేక్‌కు నోటీసులు పంపారు. విచారణ‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. అసలేం జరిగిదంటే..

28 ఏళ్ల తానియా ఇటీవల తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. గత రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్ చేస్తున్న తానియా మంగళవారం సూసైడ్ చేసుకుంది. తానియా ఆత్మహత్య వెనుకు ఉన్న కారణాల గురించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే దర్యాప్తులో అభిషేక్ శర్మ పేరును కూడా జత చేశారు.

Model Tania Singh suicide.. Sunrisers Hyderabad star player Abhishek Sharma in the entanglement

తానియా తన చివరి కాల్‌ను అభిషేక్‌కు చేసిందని, ఇటీవల వారిద్దరు టచ్‌లో ఉన్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తానియా సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లీగల్ ప్రొసిజర్ పూర్తిచేసిన తర్వాత స్టేషన్‌కు అభిషేక్‌ను పిలిచే పనుల్లో పోలీసులు ఉన్నారు.

మరోవైపు ఈ సంఘటనపై అభిషేక్ శర్మ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కొన్ని మీడియాల్లో తానియా, అభిషేక్ స్నేహితులు అని కథనాలు వస్తున్నాయి. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం లేదని వార్తలు వస్తున్నాయి. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ శర్మ క్రికెట్ లవర్స్‌కు సుపరిచితమే. పంజాబీ క్రికెటర్ అయిన అభిషేక్ ఆలౌరౌండర్.

2022 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అభిషేక్ ఆడుతున్నాడు. 2022 సీజన్‌లో ఈ యువ ప్లేయర్ ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 426 పరుగులు సాధించాడు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో సత్తాచాటలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 226 పరుగులే చేశాడు. కానీ అతడి నైపుణ్యం‌పై భరోసా ఉంచిన ఎస్‌ఆర్‌హెచ్ ప్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకుంది. అయితే సన్‌రైజర్స్‌కు ముందు అభిషేక్ ఢిల్లీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించాడు. కాగా, గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ అట్టడుగున నిలిచింది.

Story first published: Wednesday, February 21, 2024, 16:00 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+