యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్స్‌లో యువ టెన్నిస్ సంచలనాలు కార్లోస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్‌ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ కీలక పోరులో అల్కరాజ్ విజయం సాధించాడు. గత కొన్ని గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల నుంచి ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య బలమైన పోటీ నెలకొంది. భవిష్యత్తులో టెన్నిస్ ప్రపంచాన్ని వీరే శాసిస్తారని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతుండగానే.. ఈ ఇద్దరి స్టార్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.
ఒకే సమయంలో ఇద్దరు స్టార్లతో డేటింగ్?
స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్, రియాలిటీ స్టార్ అయిన బ్రూక్స్ నాడర్, యూఎస్ ఓపెన్ సమయంలో కార్లోస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్‌లు ఇద్దరితోనూ డేటింగ్ చేసిందని ప్రముఖ పత్రిక పేజ్ సిక్స్ ఓ రిపోర్ట్ లో పేర్కొంది. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఒకేసారి ఈ ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లతో ఆమె సంబంధాలు నడిపిందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. బ్రూక్స్ నాడర్ ఇటీవల ఈ ఇద్దరు ఆటగాళ్ల గురించి కొన్ని సూచనలు ఇవ్వగా.. ఆమె కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

సోదరి వ్యాఖ్యలతో బయటపడిన నిజం
బ్రూక్స్ నాడర్ డేటింగ్ జీవితం గురించి ఆమె సోదరి గ్రేస్ యాన్ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. బ్రూక్స్ జీవితంలో చాలా మంది అథ్లెట్లు ఉన్నారని, అందులో ఒక పేరు 'విన్నర్' లాగా వినిపిస్తుందని ఆమె చెప్పింది. దీంతో ఆమె యానిక్ సిన్నర్ గురించి మాట్లాడుతుందని అందరూ భావించారు. అయితే దీనిపై బ్రూక్స్ నాడర్ దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ జిమ్మీ కిమెల్ షోలో మాత్రం సిన్నర్ తో ఉన్న రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చెప్పింది.
కథలో ఊహించని మలుపు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో అల్కరాజ్‌కు బ్రూక్స్ నాడర్ మద్దతు ఇవ్వడంతో వచ్చింది. ఈ సంఘటన తర్వాత, గ్రేస్ యాన్‌ను అల్కరాజ్ గురించి అడగ్గా.. "ఆ పుకార్లు నిజమే. నాకు తెలుసు, ఈ రోజు హీరో అతనే" అని ఆమె చెప్పింది.ఈ ఏడాది ప్రారంభంలోనే బ్రూక్స్ నాడర్.. గ్లేబ్ సావచెంకోతో విడిపోయింది. అంతేకాకుండా, 2014లో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ, తాను ఇప్పటికీ విలియం హెయిర్‌తో 'చట్టబద్ధంగా వివాహం' చేసుకుని ఉన్నానని ఆమె జనవరిలో అంగీకరించింది. ఈ సంచలన వార్త టెన్నిస్ అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది.