నా కడుపులో అఫ్రిది బిడ్డ: నటి ఆర్షిఖాన్ సంచలనం (వీడియో)
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పైన గత కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ నటి, మోడల్ అర్షి ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో తాను సన్నిహితంగా గడిపానంటూ గతంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది.
తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అఫ్రిది కారణంగా తాను గర్భవతిని అయ్యానని చెప్పింది. తన కడుపులో అతని బిడ్డ పెరుగుతున్నాడంటూ సంచలన ప్రకటన చేసింది.
అంతేకాక లవర్‌గా అఫ్రిదికి వందకు వంద మార్కులేయవచ్చని పేర్కొంది. దాదాపు ఆరు నెలల క్రితం అర్షి ఖాన్ ఓ సంచలన ప్రకటన చేసింది. అఫ్రిదీతో తాను సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పింది. ట్విట్టర్‌లో ఆమె ఆ రహస్యాన్ని బయటపెట్టింది. అది తనకు ప్రేమాస్పదమైందని తెలిపింది.
"అవును, అతనితో సెక్స్‌లో పాల్గొన్నా. ఎవరితోనైనా పడుకోవాలంటే భారత మీడియా అనుమతి తీసుకోవాలా, ఇది నా వ్యక్తిగత జీవితం. అది నాకు ఇష్టమైంది" అని ఆమె ట్వీట్ చేసింది.
షాహిద్ అఫ్రిదీతో సంబంధం ఉన్నట్లు వచ్చిన పుకార్లను ఆమె ఇంతకు ముందు ఖండించింది. తాము మంచి మిత్రులమని, తాము కొన్నిసార్లు కలిశామని, అంతకు మించి ఏమీ లేదని ఆమె చెప్పింది. భోపాల్‌కు చెందిన మోడల్ అర్షి ఖాన్ షాహిదీ అఫ్రిదీతో గడిపినట్లు వార్తలు కూడా వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications